

Twitter | పాపులర్ సోషల్ మీడియా దిగ్గజం ట్విటర్(#Twitter).. ఇకపై ఓ భారతీయుడి చేతుల్లోకి వెళ్లనుంది. టెక్ దిగ్గజంగా పేరున్న ట్విటర్‌కు సీఈవోగా భారత సంతతికి చెందిన పరాగ్ అగర్వాల్ సోమవారం నియామకం పొందారు. ట్విటర్లో ఈ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా పరాగ్ నిలిచారు.
ట్విటర్ సహ వ్యవస్థాపకుడు జాక్ డోర్సే ఈ మధ్యనే ట్విటర్ సీఈవో బాధ్యతల నుంచి తప్పుకున్నారు. దీంతో ఆయన స్థానంలో కొత్త సీఈవోను ఎంపిక చేయాల్సి వచ్చింది.
ట్విటర్‌కు పదేళ్లుగా అత్యుత్తమ సేవలు అందిస్తున్న పరాగ్‌ను సీఈవోగా నియమిస్తూ ట్విటర్ నిర్ణయం తీసుకుంది. ఇక ఇంత తక్కువ కాలంలో పరాగ్.. ఈ ఘనత దక్కించుకోవడం విశేషం.

భారత్‌కు చెందిన పరాగ్ అగర్వాల్ 2005లో బాంబే ఐఐటీ నుంచి కంప్యూటర్ సైన్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ చేశారు. ప్రఖ్యాత స్టాన్‌ఫోర్డ్ వర్సిటీలో 2011లో కంప్యూటర్ సైన్స్ విభాగంలో పీహెచ్‌డీ చదివారు. పీహెచ్‌డీ చేస్తున్న సమయంలో మైక్రోసాఫ్ట్, ఏటీ అండ్ టీ ల్యాబ్స్, యాహూలలో పరిశోధనలు చేశారు.
అనంతరం 2011లో ట్విటర్(Twitter)లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పరాగ్ అగర్వాల్‌కు ఉద్యోగం దక్కింది. అనంతరం 2018లో ట్విటర్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్(సీటీవో)గా ఉద్యోగోన్నతి పొందారు.

ట్విటర్ టెక్నికల్ స్ట్రాటజీ, మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగాల్లో వినియోగదారులు, ఆదాయం, సైన్స్ బృందాల బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తించారు. ఇక ఇప్పుడు మూడేళ్లలోనే సీటీవో నుంచి ఏకంగా సీఈవో స్థాయికి ఎదిగారు.
Read Also: American Airlines | 2:30 గంటలు.. 1640 కిలోమీటర్లు.. వామ్మో వీడి తెలివి పాడుగానూ!