

Shocking | అమెరికాలో ప్రైవేట్ ఆల్బమ్స్ ఎక్కువ అనే విషయం తెలిసిందే. అక్కడ పబ్లిక్ సింగర్స్ కి ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. అందుకే వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు కొత్త పాటలతో, మ్యూజిక్ తో అభిమానులను అలరిస్తుంటారు. అయితే ఈ ప్రయత్నంలో కొంతమంది హద్దులు దాటేస్తుంటారు. దీనివల్ల వాళ్ళు ప్రమాదంలో పడడమే కాక, అభిమాఅనులనూ ఆందోళనకు గురి చేస్తుంటారు. అలాంటి పనే చేశారు అమెరికన్ సింగర్ మైటా.
మైటా ఈ మధ్య ఓ సాంగ్ చేసేందుకు 2 పాములతో ఆమె స్టంట్ చేయాల్సి ఉంది. అందులో భాగంగానే.. ఓ పామును శరీరంపై వేసుకుని పడుకుని మైటా. ఇంతలో మరో పమవును ఆమె శరీరంపై వదిలారు.

అయితే రెండో పామును వదలగానే అది మైటా మూతి భాగంలో గట్టిగా కరిచింది. పామును మైటా వెంటనే విదిలించి పారేసినా.. ఈ ఘటనతో అంతా షాక్ కి గురయ్యారు. అయితే ఆ పాము విషం లేనిది కావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ముందు జాగ్రత్తగా మైటాను హాస్పిటల్ కి తీసుకెళ్లారు. ఆమెకు ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. అయితే ప్రమాదం ఏమీ లేదని డాక్టర్లు చెప్పినట్లు సమాచారం.
కాగా.. పాము మైటాను కరిచిన వీడియో ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయడంతో విపరీతంగా వైరల్ అవుతోంది.
Singer #Snake #Instagram #Shocking #ViralVideo