

Shocking | కొంతమంది అధికారులు వ్యాక్సిన్ డోసులను బ్లాక్ మార్కెట్ లో అమ్ముకుంటూ మోసం చేస్తున్నారు. ఇంకొంతమంది వ్యాక్సిన్ వేయించుకోకుండానే వేయించుకున్నట్లు ఫేక్ సర్టిఫికెట్లు తయా4యూ చేసి దొరికిపోతున్నారు. కానీ ఇప్పుడు చెప్పబోయే మోసం వీటన్నింటికంటే మించిపోయింది. ఈ మోసం గురించి వింటేనే మైండ్ బ్లాంక్ అయిపోతుంది. కొంతమంది చేసిన ఈ మోసంతో ఓ వ్యక్తి ఒక్కరోజులో ఏకంగా 10 వ్యాక్సిన్ దోమలు తీసుకున్నాడు.
కోవిడ్ నుంచి కాపాడుకోవడానికి ఉన్న ఒక్కటే మార్గం వాక్సినేషన్. కానీ ఈ వ్యాక్సిన్ విషయంలో కూడా కొందరు ఎవరూ ఊహించని విధంగా మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా న్యూజిలాండ్ లో ఇలాంటి ఓ విచిత్రమైన సంఘటన జరిగింది. ఓ వ్యక్తి డబ్బులకు ఒక్కరోజులో 10 చోట్ల 10 వ్యాక్సిన్ దోమలు తీసుకున్నాడు. అతడు అనేక వ్యాక్సిన్ సెంటర్లలో కనిపించడంతో అధికారులకు అనుమానం వచ్చి డేటా తీస్తే ఈ షాకింగ్ విషయం బయటపడింది.
ఇలా వ్యాక్సిన్ తీసుకోవడం కోసం అతడికి కొంతమంది డబ్బులు ఇచ్చినట్లు అధికారులు గుర్తించారు. వాళ్ళ తరపున వ్యాక్సిన్ వేయించుకోవడానికి ఇతడు డబ్బులు తీసుకుని ఇలా 10 డోసులు తీసుకున్నల్టు అధికారులు చెబుతున్నారు. అయితే న్యూజిలాండ్ లో వ్యాక్సిన్ వేయించుకోవడానికి ఎలాంటి గుర్తింపు కార్డ్ అవసరం లేకపోవడంతో ఈ మోసం జరిగిందని ఓ నిర్ధారణకు వచ్చారు.
అయితే ఆ వ్యక్తి ఇప్పటికీ ఎక్కడున్నాడు..? ఎలా ఉన్నాడు అనేది అధికారులు కనిపెట్టలేకున్నారు. కానీ ఈ విషయాన్ని ఆ దేశ ఆరోగ్యశాఖ సీరియస్ గా తీసుకుంది. ఈ విషయంలో సదరు ఏజెన్సీలు కఠిన నిర్ణయాలు తీసుకోవాలని సూచించింది. అలాగే ఆ వ్యక్తిని వెతికి పట్టుకోవాలి ఆదేశించింది. ఇలా వ్యాక్సిన్ తీసుకోవడం క్షమించరాని నేరమని, అతడి ప్రణానికే ప్రమాదం కాకుండా, వ్యాక్సిన్ వేసుకొని వారి ద్వారా కరోనా వ్యాప్తికి కారణం అవుతారని పేర్కొంది.