

Red Fort | ఢిల్లీ హైకోర్టుకు ప్రతి రోజూ ఎన్నో పిటీషన్లు వస్తుంటాయి. తాజాగా హైకోర్టుకు ఓ వింత పిటిషన్ వచ్చింది. ఎర్రకోట తన కుటుంబానికి చెందిన ఆస్తి అంటూ ఓ 68ఏళ్ల మహిళ ఈ పిటిషన్ దాఖలు చేసింది.
తాను గత మొఘల్ చక్రవర్తి బహదూర్ షా-2 మునిమనవడి భార్యనని, అప్పట్లో ఈస్ట్ ఇండియా కంపెనీ వారు బహదూర్ షా-2ను మోసం చేసి ఎర్రకోటను ఆక్రమించుకున్నారని ఆమె తన పిటిషన్‌లో పేర్కొంది. అంతేకాకుండా ఇన్నాళ్లు ప్రభుత్వం ఎర్రకోటను స్వాధీనం చేసుకున్నందుకు తనకు పరిహారం చెల్లించాలని కోరింది.
ఇప్పటికైనా తనకు న్యాయం చేసి ఎర్రకోటను అప్పజెప్పాలని తెలిపింది. దీనిపై విచారణ జరిపిన ఢిల్లీ హై-కోర్టు.. ఆమె పిటిషన్‌ను పరిశీలించి ‘మీరు చెప్పిన దాని ప్రకారం మీకు 1857లో అన్యాయం జరిగింది. మరి ఇన్నాళ్లు మీరు ఎందుకు కోర్టును ఆశ్రయించలేదన్నది తెలిపాలని వివరణ కోరింది.
అందుకు ఆమె సరైన వివరణ ఇవ్వకపోవడంతో.. ఢిల్లీ హైకోర్లు ఆ పిటీషన్‌ను కొట్టివేసింది.
#High Court #Red Fort #Mughal