Forest City | ప్రపంచానికి ఓ కొత్త సొల్యూషన్.. మలేషియాలోని ఫారెస్ట్ సిటీ

Forest City | అడవులను నరికేసి మరీ ఆక్రమించేస్తున్నారు. చెట్లు కొట్టేసి బిల్డింగ్‌లు కట్టేస్తున్నారు. ప్రకృతిని నాశనం చేస్తూ ప్రపంచాన్ని

Spread the love
Forest City
Forest City

Forest City | అడవులను నరికేసి మరీ ఆక్రమించేస్తున్నారు. చెట్లు కొట్టేసి బిల్డింగ్‌లు కట్టేస్తున్నారు. ప్రకృతిని నాశనం చేస్తూ ప్రపంచాన్ని కాంక్రీట్ జంగిల్స్‌గా మార్చేస్తున్నారు. దీంతో ఈ భూమిపై పర్యావరణం దెబ్బతని పచ్చదనం తగ్గిపోతోంది.

ఫలితంగా ఎన్నో జంతువులు, మొక్కలు అంతరించిపోయే స్థితికి చేరుకున్నాయి. దీనికి పరిష్కారం కనిపెట్టలేక ప్రపంచ దేశాలన్నీ తలలు పట్టుకుంటున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఓ దేశం ప్రపంచానికి ఓ సొల్యూషన్ ఇచ్చింది. ఓ కొత్త మార్గం చూపించింది. అదే ఫారెస్ట్ సిటీ.

మలేషియా ప్రభుత్వం ఈ ఫారెస్ట్ సిటీని నిర్మిస్తోంది. ఇక్కడ ప్రత్యేక ఏంటంటే.. చెట్లు, మొక్కలు భూమిపైన మాత్రమే కాదు.. అక్కడ ఏకంగా బిల్డింగ్‌లపై పెరుగుతాయి. ఎంత ఎత్తైన భవనం అయినా.. ప్రతి అంతస్తూ పచ్చదనంతో కళకళలాడుతుంటుంది.

100 బిలియన్ డాలర్లకు పైగా ఖర్చుతో ప్రపంచానికే ఓ రోల్ మోడల్ సిటీగా నిలుస్తున్న సింగపూర్‌కి అతి చేరువలో ఈ ఫారెస్ట్ సిటీని నిర్మిస్తోంది మలేసియా.

#ForestCity #Malasia #Singapore #Viral

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *