

New Year | కొత్త సంవత్సరం రోజున కార్లు తగలబెట్టాల్సిందే.. ఈ వింత సంప్రదాయం ఎక్కడంటే?కొత్త సంవత్సరం వస్తే మనం ఎలా సెలబ్రేట్ చేసుకుంటాం? కొందరు కేకులు కోస్తారు, కొందరు డీజేలు పెట్టి డ్యాన్సులు చేస్తారు.
కుర్రాళ్లయితే బైకులపై వీధుల వెంబడి తిరుగుతూ ‘హ్యాపీ న్యూ ఇయర్’ అంటూ కేకలు పెడతారు. కానీ న్యూఇయర్ కోసం ఇళ్లలో ఉండే కార్లను తగలబెడతారని తెలుసా? అయితే ఇది మన దగ్గర కాదులెండి. పాశ్చాత్య దేశం, ఫ్యాషన్ పుట్టినిల్లు ఫ్రాన్స్‌లో.
ఇక్కడ ప్రతియేటా నూతన సంవత్సరం సందర్భంగా పాత కార్లను తగలబెట్టేస్తారట.
ఈ నేపథ్యంలోనే తాజాగా 2022 కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకొని 874 కార్లను తగలబెట్టారట. గతంతో పోల్చుకుంటే ఈ సంఖ్య చాలా తక్కువని ఫ్రాన్స్ ఇంటీరియర్ శాఖా మంత్రి గెరాల్డ్ డార్మానిన్ చెప్పారు.
కరోనా కారణంగా ఈ దేశంలో పలు నిబంధనలు విధించారు. అందుకే ఇలా కార్లను తగలబెట్టేందుకు చాలా మంది రాలేదట. లేదంటే ఈ నెంబర్ మరో రేంజ్‌లో ఉండేదని అంటున్నారు.
కరోనా మహమ్మారి రాక ముందు అంటే 2019 వేడుకల్లో ఫ్రాన్స్‌లో 1316 కార్లను అగ్నికి ఆహుతి చేశారని ఇంటీరియర్ మినిస్ట్రీ చెప్తోంది. ఈ సంప్రదాయానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి.