INDvsENG | ఇండియాను దోచుకున్నాకే ఇంగ్లండ్ ఎదిగిందా..?

INDvsENG

INDvsENG | ఇండియాని దోచుకుని ఇంగ్లండ్ అభివృద్ధి చెందింది. ఈ విషయం అందరికీ తెలుసు. అందులో కొత్తేముంది..? అంటారా. కానీ ఇండియా నుంచి సంపదను దోచుకోకముందు ఇంగ్లండ్ కూడా పేదరికంలో మగ్గింది అనే విషయం మీలో ఎంతమందికి తెలుసు..?
1800 లో ఇంగ్లండ్ వేగంగా అభివృద్ధి చెందుతూ వచ్చింది. పారిశ్రామికంగా శరవేగంగా అభ్యున్నతి సాధిస్తోంది. కొత్త కొత్త పరిశ్రమలు ఏర్పాటవుతున్నాయి. దీంతో పక్కన ప్రాంతాల నుంచి జనాలు వేల సంఖ్యలో ఇంగ్లండ్ రాజధాని లండన్‌కు తరలి వచ్చారు.

అలా వచ్చిన జనాలకు ఇళ్లు లేక చలికి చచ్చిపోయే వారు. ఆ చావులను తగ్గించేందుకు కొన్ని కంపెనీలు ముందుకొచ్చి.. సమాధులవంటి బాక్సులు వరుసగా ఏర్పాటు చేసి.. జనాలకు ఇచ్చింది. అందులో ఓ రాత్రి పడుకోవడానికి 3 పెన్నీలు చెల్లించాలి.
అలాగే ఇంకొన్ని కంపెనీలు గుర్రపు సావిడులలో తాళ్లు కట్టి.. వాటిపై పడుకోమని చెప్పేది. అలా పడుకున్నందుకు కూడా కొన్ని పెన్నీలు చెల్లించాలి. ఉదయాన్నే ఓనర్లు వచ్చి ఆ తాళ్లను కట్ చేసే వాళ్లు. ఎందుకంటే అదే ప్రాంతాన్ని వేరే వాళ్లకు, వేరే పనికి ఉఫయోగించుకునే వాళ్లు.

అయితే ఆ తర్వాతి కాలంలో భారతదేశం నుంచి దోచుకెళ్లిన సంపదతో అక్కడ ఇంకా పరిశ్రమలు స్థాపించి.. అక్కడి జనాలకు ఉద్యోగాలు కల్పించి.. వారందరికీ శాశ్వత నివాసాలు కల్పించింది ప్రభుత్వం. అలా ఇంగ్లండ్ అభివృద్ధి చెందిన దేశంగా ఎదిగింది.
అంతకుముందు ఇంగ్లండ్ కూడా అంత గొప్ప దేశమేమీ కాదు.. అక్కడ కూడా పూరిల్లు, పేదలు ఉండేవాళ్లు. కానీ ప్రపంచాన్ని ఆక్రమించి దేశదేశాల్లోని సంపదను దోచుకెళ్లి, వాటిని ఉపయోగించి ఇంగ్లండ్ అభివృద్ధి చెందిందన్నమాట.
#INDvsENG #England #India #London