

200 మీటర్ల ఎత్తులో ఉండే ఇన్ఫినిటీ పూల్ మళ్లీ తెరుచుకుంది. కరోనా కారణంగా మూతబడిన ఈ విలాసవంతమైన పూల్ ఎట్టకేలకు ఇప్పుడు తిరిగి పర్యాటకులను స్వాగతిస్తోంది. దీని కోసం దేశవిదేశాల నుంచి పర్యాటకులు క్యూ కడుతున్నారు. దీని గురించి తెలిస్తే రేటు కాస్త ఎక్కువయినా పర్లేదు జీవితంలో ఒక్కసారి అక్కడి వెళ్లి అందులో మునకలు వేయాలని మీకూ అనిపిస్తుంది. దీని విస్తీర్ణం 750 చదరపు మీటర్లు. దీనికి ఇంకా కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి.
ఇది కూడా చదవండి: Traffic Rules | పోలీసులకు రూల్స్ లేవా..? నిలదీసిన మహిళ
ఇది భూమి నుంచి 200 మీటర్ల ఎత్తులో, 360 డిగ్రీల్లో విస్తరించి ఉంది. ఇది దుబాయ్‌లోని పాల్మ్ టవర్ హోటల్ 50వ అంతస్తులో నిర్మించబడింది. అంతస్తు అంతా పూల్ ఉంటుంది. ఈ పూల్ ఎంట్రీ ఫీజ్ 170 దుబాయ్ డాలర్లు అంటే ఇండియా రూపాయల్లో 3,450 అన్నమాట. దాంతో పాటుగా మీరు రూ.12,190 పెట్టుకుంటే రోజంతా వీఐపీ ఐల్యాండ్ ఎక్స్‌పీరియన్స్ కలుగుతుంది.