Shani singhanapur | బాబోయ్ ఇదేం ఊరు.. తలుపులంటే తెలీదా?

Shani singhanapur | బయటకు వెళుతున్నామంటే చాలు తలుపులకు తాళాలు వేసి వెళతాం. కానీ తాళాలు కాదు కదా.. కనీసం తలుపులు కూడా..

Spread the love
Shani Shingnapur Is A Village In Maharashtra Having No Doors And Locks

Shani singhanapur | ఇంట్లోనుంచి బయటకు వెళుతున్నామంటే తలుపులకు తాళాలు వేసి.. సరిగ్గా పడ్డాయా..? లేదా..? అని ఒకటికి నాలుగుసార్లు చెక్ చేస్తాం. కానీ తాళాలు కాదు కదా.. కనీసం తలుపులు కూడా లేని ఊరి గురించి తెలుసా..? ఆ ఊరి పేరు శని సింగనాపూర్. ఇది మహారాష్ట్రలో ఉంది.

ఈ ఊళ్లో ఏ ఇంటికీ తలుపులు ఉండవు. ఇళ్లకే కాదు.. దుకాణాలు, ఆఫీసులు, బ్యాంకులు వేటికీ తలుపులు ఉండవు. ‘అదేంటి..? తలుపులు లేకపోతే దొంగలు పడరా..?’ అని మీకు అనుమానం రావచ్చు. దానికి ఈ ఊరి వాళ్లు చెప్పే ఆన్సర్ ఒక్కటే.. పడరు.

Shani Shingnapur Is A Village In Maharashtra Having No Doors And Locks

ఈ ఊరిలో వాళ్లంతా శనీశ్వరుడిని తమ గ్రామ దేవతగా కొలుస్తారు. ఆ శనిదేవుడే తమను కాపాడతాడని, ఎలాంటి దొంగతనాలు చేసినా, తప్పు చేసినా శిక్షిస్తాడని వారి నమ్మకం.

అంతేకాదు.. ఇక్కడున్న శనీశ్వరుడి ఆలయం కూడా బాగా పాపులర్. ఈ ఆలయానికి దేశంలోని అనేక ప్రాంతాల నుంచి రోజూ 2వేల మంది వస్తుంటారు. ఆ ఊరిలోలా మన ఊరిలో కూడా ట్రై చేస్తే బాగుంటుందంటారా..? మరి ఆలోచించుకోండి. మీ వస్తువులను మీదే బాధ్యత.

#Maharastra # ShaniSinghanapur #DoorlessHomes

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *