Daughters | తండ్రికి తలకొరివి పెట్టి రుణం తీర్చుకున్న కూతుళ్లు

Daughters

Daughters: హిందూ సాంప్రదాయం ప్రకారం తండ్రి చనిపోతే కొడుకు తలకొరివి పెట్టాలి. కానీ ఆ తండ్రికి కొడుకు లేడు. అయితే ఏం ఆ లోటును అతడి కూతుళ్లిద్దరూ తీర్చారు. సంప్రదాయాలను పక్కన పెట్టి తమ తండ్రికి తలకొరివి పెట్టి కన్న రుణం తీర్చుకున్నారు. నాన్నకు కొడుకు లేని లోటు తీర్చారు. ఆ తండ్రి మృతి చెందిన వేళ.. అన్నీ వారై పాడెమోసి.. చితికి నిప్పంటించి రుణం తీర్చుకున్నారు.
ఎంవీపీ కాలనీ సెక్టార్ –2లో ఉజ్జి గణపతి నివశిస్తున్నాడు. అయితే ఆయన అనారోగ్యంతో మంగళవారం మరణించారు. ఆయనకు రిపుపర్ణ, ఉపాసన అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆయన తొలి నుంచి కుమార్తెలను గొప్పగా ఆదర్శాలను అందించి పెంచారు. మంచి చదువు చెప్పించారు. గొప్ప ఉద్యోగాల్లో స్థిరపడేలా ప్రోత్సహించారు.
ప్రస్తుతం రిపుపర్ణ ప్రస్తుతం హెచ్‌ఎస్‌బీసీలో ఉద్యోగం చేస్తుంన్నారు. ఉపాసన హైదరాబాద్‌లోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. ఇదే సమయంలో తండ్రి అనారోగ్యంతో మరణించాడు. కొడుకు లేకపోవడంతో కూతుళ్లిద్దరే తండ్రి పాడె మోశారు. ఆయనకు తలకొరివి పెట్టి రుణం తీర్చుకున్నారు.