Apple | యాపిల్ న్యూ రికార్డ్.. ప్రపంచంలోనే మొదటి కంపెనీ..

Apple | యాపిల్ కంపెనీ సరికొత్త రికార్డు సృష్టించింది. ప్రపంచంలో ఏ కంపెనీ సాధించని మైలురాయిని యాపిల్ తాకింది. ఈ కంపెనీ మార్కెట్ విలువ

Spread the love
Apple

Apple | యాపిల్ కంపెనీ సరికొత్త రికార్డు సృష్టించింది. ప్రపంచంలో ఏ కంపెనీ సాధించని మైలురాయిని యాపిల్ తాకింది. ఈ కంపెనీ మార్కెట్ విలువ సోమవారం 3 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది.

పబ్లిక్ ట్రేడ్ చేస్తూ ఈ ఘనత సాధించిన తొలి కంపెనీ యాపిల్ కావడం విశేషం. యాపిల్ కొవిడ్ టైంలో అధిక విక్రయాలను నమోదు చేసింది. ఈ మేరకు కంపెనీ నివేదికలో ప్రకటించింది.

గతేడాది కరోనా కారణంగా ఎక్కువ శాతం ఉద్యోగులు ఇంటి నుంచే పని చేయడంతో యాపిల్ ఉత్పత్తులకు గిరాకీ పెరిగింది. యాపిల్ 2018 ఆగస్టు నాటికి 1 ట్రిలియన్ డాలర్ల వ్యాపారం చేసింది.

అదే విధంగా 2020 ఆగస్టు నాటికి 2 ట్రిలియన్ డాలర్ల మార్క్‌ను దాటింది. ప్రస్తుతం 3 ట్రిలియన్ డాలర్ల మార్క్‌కు అతి చేరువలో ఉందని కంపెనీ అధికారులు తెలిపారు.
# apple# business# public trade

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *