

Viral Video | మన నిత్య జీవితంలో మనం ఎన్నో వింతలు చూస్తుంటాం. వాటిలో కొన్ని మనకు సిల్లీగా అనిపించినా మరికొన్ని మాత్రం జుట్టుపీక్కునేలా చేస్తాయి. అలాంటి వాటిని ఎంత పరిశీలించినా తికమక ఏర్పడుతుందే తప్ప సమాధానం దొరకదు. ఆ వీడియోలు, ఫొటోలు మనకు అర్థం కాకపోయినా వాటిని మళ్లీ మళ్లీ చూడాలనుకుంటాం.
ఈ కింది వీడియో కూడా అలాంటిదే. సాధారణంగా రోడ్లపై ఫ్లైఓవర్లు ఉంటాయి. వాటి కింద నుంచి వాహనాలు వెళుతుంటాయి. అదే విధంగా పైనుంచి కూడా అనేక వాహనాలు వెళుతుంటాయి. కానీ ఈ వీడియోలో మాత్రం అలా కాదు. ఈ వీడియో చూసిన తర్వాత మీరు అనే ఒకే ఒక మాట ఎలా? ఎలా? ఇదే అడుగుతారు.
ఇక వీడియో విషయానికొస్తే.. ఫ్లైఓవర్‌పై నుంచి వస్తున్న కార్లు ఒక్కసారిగా పక్కకు తిరుగుతున్నాయి. అలాగని అవి కిందపడిపోవట్లేదు. మాయం అయిపోతన్నాయి. అవతలి నుంచి ఇవతలికి రావడం లేదు. కానీ అవేమవుతున్నాయో కనిపించడం లేదు. బైకులు, కార్లు అన్నీ కూడా చాలా సాఫీగా వెళ్లిపోతున్నాయి. దీంతో ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
వీడియో పెట్టిన అతి తక్కువ సమయానికే వేలల్లో వ్యూస్, షేర్లు అందుకుంది.
అయితే వీడియో గుట్టేంటంటే అసలు అది ఫ్లైఓవర్ కాదు. అది బిల్డింగ్ పై భాగం. అక్కడ ఫ్లైఓవర్ టన్నల్‌లా కనిపిస్తున్నది బిల్డింగ్ పిట్టగోడ. ఆ బిల్డింగ్ పై భాగాన్ని సరిగ్గా రోడ్డుకు సరిపోయేలా పెట్టి వీడియోను చిత్రీకరించారు. దీనిని చూసి నెటిజన్స్ ఔరా అంటున్నారు.
https://twitter.com/Confuxing/status/1475838889520549889?s=20
#ViralVideo #Vehicles