Shocking | 22 ఏళ్ల తర్వాత కనిపించిన ‘నడిచే చేప’

Shocking | ఆస్ట్రేలియాకు చెందిన అరుదైన “నడిచే” హ్యాండ్‌ఫిష్ 22 సంవత్సరాల తర్వాత మొదటిసారిగా టాస్మానియన్ తీరంలో

Spread the love
Shocking

Shocking | ఆస్ట్రేలియాకు చెందిన అరుదైన “నడిచే” హ్యాండ్‌ఫిష్ 22 సంవత్సరాల తర్వాత మొదటిసారిగా టాస్మానియన్ తీరంలో కనిపించింది. పింక్ హ్యాండ్‌ఫిష్‌ను చివరిసారిగా 1999లో టాస్మానియాకు చెందిన ఓ డైవర్ చూశాడు. అదే ఏడాది మరో 4 సార్లు కనపడింది. కానీ ఆ తర్వాత మళ్లీ కనిపించలేదు. దీంతో ఆ చేపను ఈ మధ్యనే అంతరించిపోతున్నట్ల జాతుల్లో అధికారులు చేర్చారు. అయితే ఆస్ట్రేలియన్ పరిశోధకులు ఈ ఏడాది ప్రారంభంలో మెరైన్ పార్క్ సమీపలోని సముద్రంలో తీసిన డీప్ సీ కెమెరా రికార్డింగ్‌లో ఈ చేప మళ్లీ కనిపించింది.

దీనిని బట్టి చూస్తే ఈ చేప ఇంతకుముందు కంటే లోతులో, మరింత విశాలమైన సముద్ర భాగాల్లో నివశిస్తున్నట్లు గుర్తించారు. నిజానికి ఈ చేపలు చిన్న సముద్రపు నీటి జాడల్లో నివశిస్తాయని భావించారు. కానీ ఇప్పుడిది ఏకంగా 150 మీ (390 అడుగులు) లోతులో కనబడడంతో వాళ్ల అంచనా తప్పినట్లైంది.

“పింక్ హ్యాండ్‌ఫిష్ మనుగడపై ఇది ఆశ కలిస్తోంది. ఎందుకంటే అవి గతంలో అనుకున్నదానికంటే విస్తృతమైన ప్రాంతాల్లో జీవించడం అలవాటు చేసుకోవడం నిజంగా మంచి విషయం. దీనివల్ల వాటి జాతి మనుగడ మరింత సులభతరం అవుతుంది” అని టాస్మేనియా విశ్వవిద్యాలయంలో అసోసియేట్ ప్రొఫెసర్ అయిన ప్రధాన పరిశోధకుడు సముద్ర జీవశాస్త్రవేత్త నెవిల్లే బారెట్ పేర్కొన్నారు.

బారెట్ తెలిపిన వివరాల ప్రకారం.. మరీన్ పార్క్ భూమి క్రస్ట్ లోపల ఏర్పడిన 4 వేల కిలోమీటర్ల లోతు లోయలో ఎన్నో జీవాలు ఉన్నాయి. వాటిపైనే అధ్యయనం చేశారు. “నేను నిశితంగా పరిశీలించాను. మీరు దాని చిన్న చేతులను చూడవచ్చు. ఈ జాతి చేపలు సముద్రంలో ఈతడంతో పాటు సముద్రం అడుగు భాగంలో “నడవడానికి” అనుకూలంగా చేతులు కలిగి ఉంటాయి” అని ఆయన చెప్పారు.

అలాగే మరో సైంటిస్ట్ మాట్లాడుతూ.. ‘15 సెంటీమీటర్ల చేప ఒక స్టోన్ క్రాబ్స్ రావడంతో భయపడి అక్కడి నుంచి పారిపోయింది. ఆ దృశ్యాలనే మా కెమెరా రికార్డ్ చేసింది. మొత్తం దృశ్యంలో కొన్ని సెకండ్ల పాటు కనిపించిన ఈ చేప చేతలు మందంగా కాళ్ల మాదిరి కనిపించడం వీడియోలో చూడవచ్చు’ అని వెల్లడించారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *