Shocking | వీధి కుక్కపై ఇంత కిరాతకమా.. సీసీ కెమెరాలో రికార్డ్ కావడంతో..

Shocking | ఓ వీధి కుక్కపై అత్యంత కిరాతకంగా కసి తీయచుకున్నాడో వ్యక్తి. తన పెంపుడు కుక్కను కలుస్తోందని ఎవ్వరూ ఊహించని దారుణానికి..

Spread the love
Shocking

Shocking | ఓ వీధి కుక్కపై అత్యంత కిరాతకంగా కసి తీర్చుకున్నాడో వ్యక్తి. తన పెంపుడు కుక్కను కలుస్తోందని ఎవ్వరూ ఊహించని దారుణానికి ఒడిగట్టాడు.

కర్రతో చావబాది.. అప్పటికీ కసి తీరక బండరాయితో తల పగలగొట్టి హతమార్చాడు. ఈ హృదయవిదారక ఘటన మధ్యప్రదేశ్ లో జరిగింది.

స్థానిక చార్ షహర్ ప్రాంతంలో బంటి బాయిస్ అనే వ్యక్తి నివసిస్తున్నాడు.

బంటి ఓ ఆడ కుక్కను పెంచుకుంటున్నాడు. అయితే ఆ కుక్కతో స్నేహం కుదిరిన ఓ వీధి కుక్క తరచూ బంటి ఇంటి ముందుకొచ్చేది.

ఇది బంటికి ఏ మాత్రం నచ్చేది కాదు. చాలాసార్లు కొట్టి తరిమినా ఆ వీధి కుక్క మళ్లీ మళ్లీ తిరిగి వస్తోంది.

దీంతో బంటికి కోపం కట్టలు తెంచుకుంది. గురువారం ఆ కుక్క మళ్లీ ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్నాడు.

పాపం ఆ కుక్క.. బంటి రూపంలో తన మృత్యువు ఎదురు చూస్తోందని గుర్తించలేని ఆ కుక్క ఎప్పటిలానే స్నేహితురాలిని చూసేందుకు ఆ ఇంటి దగ్గరకొచ్చింది. అంతే బంటిలోని రాక్షసుడు మేల్కొన్నాడు.

ఓ పెద్ద కర్రతో ఆ కుక్కని చావబాదాడు. తీవ్ర గాయాలైన వీధి కుక్క కదల్లేని స్థితిలో కోన ఊపిరితో కొట్టుకుంటోంది.

అన్ని దెబ్బలు తిన్నా అది బతికి ఉండడంతో బంటికి ఇంకా కోపం పెరిగింది.

వెంటనే పక్కనే ఉన్న ఓ బండరాయి తీసుకుని కుక్క తలపై కొట్టి చంపేశాడు.

అయితే ఈ (Shocking) దృశ్యాలన్నీ ఆ వీధిలో ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడంతో విపరీతంగా వైరల్ అయింది.

జంతు ప్రేమికుల దృష్టిలో ఈ వీడియో పడడంతో వాళ్ళు బంటిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

#Madhyapradesh #StrayDog #Shocking #Viral

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *