

Viral | కోవిడ్ నుంచి దేశాన్ని రక్షించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శరవేగంగా వ్యాక్సినేషన్ డ్రైవ్స్ నిర్వహిస్తున్నాయి. హెల్త్ వర్కర్లు, మెడికల్ ఆఫీసర్లు వీధుల్లో తిరుగుతూ ప్రజలందరికీ వ్యాక్సినేషన్ అందిస్తున్నారు. అయితే కొంతమంది మాత్రం ఇప్పటికీ వ్యాక్సిన్ అంటే భయపడుతున్నారు. వ్యాక్సిన్ వేయించుకునేందుకు వెనుకాడుతున్నారు. దీంతో అధికారులు వ్యాక్సిన్ వేసేందుకు ఇంటికి వస్తే.. వారి నుంచి తప్పించుకునేందుకు వింత వింత చేష్టలు చేస్తున్నారు.
తాజాగా పుదుచ్చేరిలో ఇలాంటి ఘటనే జరిగింది. పుదుచ్చేరి మెడికల్ ఆఫీసర్లు ఇంటింటికీ వెళ్లి వ్యాక్సిన్ వేస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ 40 ఏళ్ల వ్యక్తి వీరిని గమనించారు. తనకు కూడా వ్యాక్సిన్ వేస్తారనే భయంతో వెంటనే ఇంటిముందున్న చెట్టెక్కేశాడు.
అక్కడకు చేరుకున్న అధికారులు.. కిందకు దిగాలని, వ్యాక్సిన్ వేయించుకోవాలని సూచించారు. కోవిడ్ రాకుండా ఉండాలంటే వ్యాక్సిన్ వేయించుకోవల్సి ఉంటుందని సూచించారు. కానీ అతడు మాత్రం ఒప్పుకోలేదు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వీడియోలో కిందకు రావాలని అధికారులు పిలుస్తుంటే.. అతడు మత్రం.. ‘నేను చెట్టెక్కేశా. నన్నెవ్వరూ పట్టుకోలేరు. నేను వ్యాక్సిన్ తీసుకోను’ అని చెప్పడం స్పష్టంగా వినిపిస్తుంది.
#CovidVaccine #Puducherry #Viral #ViralVideo