Mummy | 800 ఏళ్ల నాటి ‘మమ్మీ’.. షాక్ తిన్న శాస్త్రవేత్తలు..!

Mummy
Mummy

Mummy | భూమికి ఓ ప్రత్యేకత ఉంది. మనం మంచి చేసినా, చెడు చేసినా అమ్మలా తనలో దాచుకుంటుంది. మన చరిత్ర కూడా అలాగే భూమి పొరల్లో దాగి ఉంది. జీవం పుట్టినప్పటి నుంచి ఇప్పటివరకు ప్రతి అంశానికి సంబంధించిన ఆధారాలు భూమిలో ఉన్నాయి.

వాటిలో ఇప్పటికే కొన్నింటిని మనం ఇప్పటికే మనం కనుగొన్నాం. వాటి నుంచి ఎంతో తెలుసుకున్నాం. అలాంటి ఓ విచిత్రమే తాజాగా పురావస్తు శాస్త్రవేత్తలకు లభించింది. అది 800 ఏళ్ల నాటి ఓ మమ్మీ. దానిని మొదటిసారి చూడగానే శాస్త్రవేత్తలే షాక్ అయ్యారు.

Mummy

జీవం పుట్టినప్పటి నుంచి ఇప్పటివరకు ప్రతి అంశానికి సంబంధించిన ఆధారాలు భూమిలో ఉన్నాయి. అలాంటి వాటి కోసం పురావస్తుశాఖ అధికారులు ప్రపంచవ్యాప్తంగా అన్వేషణ కొనసాగిస్తున్నారు.

పురావస్తు శాస్త్రవేత్త పీటర్ వాన్ డాలెన్ లూనా ఆధ్వర్యంలో దక్షిణ అమెరికాలోని పెరూలో ఈ అన్వేషణ కొనసాగింది. లిమా ప్రాంతంలో తవ్వకాలు జరుపుతుండగా వారికి ఓ మమ్మీ లభించింది. ఆ మమ్మీని చూసి వారంతా ఆశ్చర్యపోయారు.

ఎందుంకటే అది పూర్తిగా తాళ్లతో కట్టేసి ఉంది. ఇది దాదాపు 800 వందల ఏళ్లనాటిదని, అయితే ఆ అస్థిపంజరం పురుషుడిదా, స్త్రీదా అనే విషయం ఇంకా తెలియలేదని వారు చెప్పారు.

అలాగే ఏదైనా శిక్ష వేసి ఇలా సమాధి చేశారా..? లేక చనిపోయిన తర్వాత ఇలా పూడ్చి పెట్టడం ఇక్కడ ఆచారమా అనే విషయాలపై శాస్త్రవేత్తలు లోతుగా అధ్యయనం చేస్తున్నారు.

Mummy

పురావస్తు శాస్త్రవేత్త పీటర్ వాన్ డాలెన్ లూనా మాట్లాడుతూ.. ఆ మమ్మీ అవశేషాలు.. దక్షిణ అమెరికాలో ఆండియన్ ప్రాంతంలోని పర్వతాల సమూహ సమీపంలో ఒకప్పుడు నివసించిన తెగకు చెందినవారిదిగా కనుగొన్నారు.

ఈ మమ్మీని లిమా నగర శివార్లలో లభించిన భూగర్భ సమాధిలో ఈ మమ్మీని కనుగొన్నామని, అదే సమయంలో సిరామిక్ వస్తువులు, కూరగాయల అవశేషాలు, రాతి పనిముట్లు కూడా మమ్మీతో పాటు సమాధిలో దొరికినట్లుగా ఆయన తెలిపారు.

అయితే ఇది పురుషుడిదా లేదా స్త్రీదా అనేది తెలియాల్సి ఉందని అన్నారు. ఆ మమ్మీ తాళ్లతో కట్టబడి ఉందని.. అలాగే ముఖానికి అడ్డంగా చేతులు పెట్టుకుందని, బహుశా అక్కడి అంత్యక్రియలు ఈ విధంగా జరిగి ఉండొచ్చునని అభిప్రాయపడ్డారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *