Europe-Africa | వందేళ్ల క్రితమే వంతెన ప్లాన్.. ఇప్పటికీ ఒక్క రాయి కూడా పెట్టలేదు

Europe-Africa | ప్రపంచ మార్కెట్‌‌ని చాలా వరకు ప్రభావితం చేసే జల మార్గాల్లో ఆఫ్రికా-యూరప్ మధ్య ఉన్న జిబ్రాల్టర్ జలసంధి కూడా

Spread the love
Europe-Africa
Europe-Africa

Europe-Africa | ప్రపంచ మార్కెట్‌‌ని చాలా వరకు ప్రభావితం చేసే జల మార్గాల్లో ఆఫ్రికా-యూరప్ మధ్య ఉన్న జిబ్రాల్టర్ జలసంధి కూడా ముఖ్యమైనదే. అట్లాంటిక్ మహా సముద్రాన్ని, మెడిటెర్రేనియస్ సముద్రాన్ని కలుపుతూ ఉండే 14 కిలోమీటర్ల సన్నటి మార్గం ఇది.

కానీ దీని ఇంపార్టెన్స్ మాత్రం అంతా ఇంతా కాదు. ఈ ప్రాంతంలో ఏదైనా సమస్య తలెత్తిందంటే ప్రపంచ మార్కెట్లే ధ్వంసం అయిపోతాయి.

ఈ మధ్య కాలంలో సూయజ్ కెనాల్‌లో ఓ భారీ కార్గో షిప్ నిలిచిపోతే వందల కోట్ల సంపద నష్టం కలిగింది కదా.. ఆ సూయజ్ కెనాల్‌‌కు అమెరికా నుంచి వచ్చే ఓడలన్నీ ఈ సన్నటి మార్గం నుంచే రావాలి.

అమెరికాని అరబ్ దేశాలతో, ఆసియా దేశాలతో కలిపే ఏకైక మార్గం ఇదే.

ఈ సన్నటి మార్గంలోనే వంతెనలు, అండర్‌ గ్రౌండ్ టన్నెల్స్ కట్టాలని దశాబ్దాలుగా ప్రయత్నిస్తున్నారు యూరోపియన్లు.

ఇక్కడ బ్రిడ్జ్ కడితే పర్యాటకానికి, ఆర్థికరంగానికి బాగా ఉపయోగపడుతుందని యూరోపియన్ దేశాల భావన. అయితే ఆఫ్రికా దేశాలకా.. యూరప్‌ దేశాలకా అని అడక్కండి. అర్థం చేసుకోండి.

చాలామంది ఇక్కడ బ్రిడ్జ్ కట్టడానికి సిద్ధమై ప్లాన్స్ కూడా రెడీ చేసుకున్నారు. కానీ అప్పుడే వాళ్లకి ఓ షాకింగ్ విషయం తెలిసింది. ఇక్కడ బ్రిడ్జ్ కట్టడం పేపర్లపై గీసుకున్నంత సులభం కాదని.

దీనికి కారణం ఇక్కడున్న భౌగోళిక పరిస్థితులే. ఈ జలసంధి పైకి కనిపించడానికి కేవలం 14 కిలోమీటర్ల వెడల్పే ఉన్నా.. లోతు మాత్రం ఏకంగా 3వేల అడుగుల లోతు ఉంది.

Europe-Africa

ఇక్కడ బ్రిడ్జ్ కట్టాలంటే అంత లోతు వరకు పిల్లర్లు వెయ్యాలి. అంటే దుబాయ్‌లో ఉన్న 2,716 అడుగుల ఎత్తున్న బుర్జ్ ఖలీఫా కంటే ఎత్తైన పిల్లర్లు సముద్రంలో దించాలి. అది అసాధ్యం.

ఇక్కడున్న ఇంకో సమస్య.. సముద్రపు ప్రవాహాలు. అటు మెడిటెర్రేనియస్ సముద్రం, ఇటు అట్లాంటిక్ మహాసముద్రాలు.. ఈ జిబ్రాల్టర్ జలసంధి దగ్గర గుద్దుకుంటాయి.

అలాగే ఈ ప్రాంతంలో అడుగున మెడిటెర్రేనియన్ సముద్రం పశ్చిమానికి ప్రవహిస్తే.. పైన అట్లాంటిక్ మహాసముద్రం తూర్పు వైపుకు ప్రవహిస్తుంది.

ఇలా రెండు వైపులా నీరు గుద్దుకుంటుండడంతో ఇక్కడ పిల్లర్లు కట్టడం అసాధ్యంగా మారింది.

ఒకవేళ కట్టినా దానికోసం వందల కోట్లు ఖర్చుపెట్టాలి. అందుకే ఇక్కడ బ్రిడ్జి కట్టడం గురించి మర్చిపోవాల్సిందే అంటుంటారు చాలామంది యూరోపియన్ ఎక్స్‌పర్ట్స్.

అయితే కొంతమంది మాత్రం ఎలాగోలా ఇక్కడ బ్రిడ్జ్ కట్టాలని, తేలియాడే బ్రిడ్జ్‌లు, హైడ్రాలిక్ వంతెనలు.. ఇలా రకరకాల ప్లాన్‌లు వేసుకున్నారు.

కొంతమందైతే ఈ రెండింటి మధ్యలో దుబాయ్‌లోని పామ్ ఐల్యాండ్స్‌లా ఓ కృత్రిమ దీవిని నిర్మించి.. దాని మీదుగా బ్రిడ్జ్ నిర్మించాలనుకున్నారు.

కానీ అవన్నీ పేపర్లలో అయితే సిద్ధమయ్యాయి కానీ.. నిర్మించడానికి మాత్రం ఎవ్వరూ ముందుకు రాలేదు.

బ్రిడ్జ్‌లు మాత్రమే కాదు.. కింది నుంచి సొరంగాలు తవ్వాలని కూడా కొంతమంది నమూనాలు రెడీ చేసుకున్నారు. కానీ ఈ ప్రాంతంలో ఉన్న రాళ్లు చాలా బలంగా ఉన్నాయి.

Europe-Africa

వాటిని తవ్వడం, రంథ్రాలు చేయడం అంత సులభం కాదు.

అలాగే ఇక్కడ 3వేల అడుగుల లోతున్న సముద్రం కింది నుంచి టన్నెల్ వెయ్యాలంటే.. అంతకంటే లోతుకు తవ్వకాలు జరిపి సొరంగాలు సిద్ధం చెయ్యాలి. అది కూడా కుదరదు.

ఇక మూడోది.. అటు ఆఫ్రికన్ టెక్టానిక్ ప్లేట్-ఇటు యూరేషియన్ టెక్నానిక్ ప్లేట్స్ రెండింటి మధ్యలో ఇది ఉండడం వల్ల ఇక్కడ భూకంపాలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

అంటే.. ఒకవేళ ఇక్కడ వందల కోట్లు పెట్టి బ్రిడ్జ్‌లు, టన్నెల్స్ కట్టినా.. ఒక్కసారి భూకంపం వచ్చిందంటే.. అంతా వృథానే. దాంతో దేశాలన్నీ ఈ ప్రాజెక్టును వదిలేశాయి.

కానీ ఈ ఏడాది ఇంగ్లండ్‌ ఇక్కడ టన్నెల్ నిర్మించాలని అనుకుంటోంది.

ఇప్పటికే యూరోపియన్ యూనియన్‌లో నుంచి గెంటేయడంతో ఒంటరిగా మారిన ఇంగ్లండ్.. ఎలాగైనా తనకంటూ ఓ ప్రత్యేకంగా ఓ మార్కెట్ ఏర్పాటు చేసుకోవాలని, ఆ మార్కెట్ ఆఫ్రికా అయితే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ మొదలుపెట్టింది.

అయితే ఈ ప్రాజెక్ట్ మొదలుపెట్టిందని తెలుసుకానీ.. అంతకుమించి ఎలాంటి సమాచారం ఇంకా బయటకు రాలేదు.

ఒకవేళ ఈ ప్రాజెక్ట్ పూర్తయితే ఆఫ్రికాలో కూడా అభివృద్ధి జరుగుతుందని నిపుణుల మాట.

#Europe #Africa #StraitofGibraltar #14kmBridge

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *