Skating Toddler | చూడడానికే బుడత.. చేసే పనుల్లో మాత్రం చిరుత..!

Skating Toddler

Skating Toddler:ఎందులో అయినా నైపుణ్యం సాధించాలంటే సంవత్సరాల పాటు కష్టపడాలి. కఠోర శ్రమ చేయాలి. అప్పుడు కానీ మనం అనుకున్నదానిలో ప్రావీణ్యం సంపాదించలేం. కానీ కొంతమందికి పుట్టుకతోనే టాలెంట్‌తో పుడతారు. అలా పుట్టిన బుడతే చైనాకు చెందిన 11 నెలల వాంగ్ యూజీ. ఏడాది వయసు కూడా లేని ఈ బుడత.. స్కేట్ బోర్డుతో అబ్బురపరిచే విన్యాసాలు చేస్తోంది. ఏడాది వయసు కూడా లేని పిల్లలు నిలబడడమే కష్టం. అలాంటిది యూజీ మాత్రం ఏకంగా స్నో బోర్డుతో మంచుపై రయ్ రయ్ మంటూ దూసుకెళ్తోంది.

ఈ చిన్నారి ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ సెన్సేషన్. ఇప్పుడు చైనాలో చలికాలం. అనేక ప్రాంతాల్లో విపరీతంగా మంచు కురుస్తుంది. ఈ క్రమంలోనే హైబై ప్రావిన్స్‌లోని చాంగ్లీ జిల్లాలో స్నో బోర్డింగ్ చేయడానికి చాలా మంది వస్తారు. యూజీ తల్లిదండ్రులు కూడా ఇక్కడకు వచ్చారు. వారితో పాటు యూజీ కూడా చిన్న స్నో బోర్డు తీసుకుని స్నో స్కేటింగ్‌తో అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. తెల్లటి మంచు పర్వతాలపై చిరుతలా కదులుతూ విన్యాసాలు చేస్తోంది.