నాగుపాము vs ముంగిస.. fight ఏం ఉందిలే..!

fight

పాము, ముంగిస కొట్లాట(fight ఎప్పుడైనా చూశారా..? ఈ రెండూ కొట్టుకుంటే ఎక్కువగా ముంగిసదే గెలుపు. కానీ ఈ ఫైట్‌లో మాత్రం పాము ముంగిసను కొట్టి తరిమేసింది. పాడుబడిన బిల్డింగ్‌లో జరిగిన ఈ ఫైట్‌లో ఓ నాగుపాము ఎలాగో వచ్చి చేరింది. అది అక్కడి నుంచి గోడ వాలుగా పైకి ఎక్కాలని విశ్వప్రయత్నం చేస్తోంది. ఇంతలో రెండు ముంగిసలు అక్కడికి వచ్చేశాయి.
కానీ అక్కడే ఉన్న పామును చూడగానే పక్కకు వెళ్లిపోయాయి. కానీ మళ్లీ ఏమనుకుందో ఏమో పెద్ద ముంగిస మళ్లీ తిరిగి వచ్చింది. పాముతో తోక పట్టుకుని కొరకాలని చూసింది. కానీ ముంగిస రావడాన్ని ముందుగానే పసిగట్టిన పాము దానిపై ఎదురు దాడికి దిగింది. ముంగిస పామును రెండు సార్లు కొరకాలని ప్రయత్నించింది. కానీ పాము పెద్దగా ఉండడం, వేగంగా కదలడంతో ముంగిస వల్ల కాలేదు.
పడగవిప్పిన పాము ముంగిసను కాటు వేయబోయింది. కానీ పాము కాటును తప్పించుకున్న ముంగిస.. మళ్లీ దానిపై దాడికి ప్రయత్నించింది. అయితే కొంత సేపు ఫైట్ తరువాత పాము ఆకారం పెద్దది కావడంతో తన వల్ల కాదనుకుందో ఏమో ముంగిస అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ ఫైట్ జరుగుతున్నంతసేపూ అక్కడే మరో ముంగిస పక్క తనకేం తెలీనట్లు ఉండడం విడ్డూరం.