స్కూళ్లనే టార్గెట్ చేసుకున్న hackers.. ఇప్పటికే 1200 స్కూళ్లపై దాడులు
అమెరికా విద్యార్థులకు నేషనల్ బ్రాడ్ కాస్టింగ్ కంపెనీ (ఎన్‌బీసీ) హెచ్చరికలు జారీ చేసింది. ప్రతి విద్యార్థి, పాఠశాల అప్రమత్తంగా ఉండాలంటూ సూచనలు చేస్తోంది. పెద్ద ఐటీ కంపెనీలను టార్గెట్ చేసే హ్యాకర్లు తమ రూట్ మార్చారని, ప్రస్తుతం వారు స్కూళ్లపై సైబర్ దాడులు చేస్తున్నారని ఎన్‌బీసీ తెలిపింది. విద్యార్థుల వ్యక్తిగత విషయాలను దొంగలించి పైబర్ దాడుదలకు దిగుతున్నారని, డబ్బు ఇవ్వని వారి వివరాలను డార్క్ వెబ్‌లో అమ్ముకుంటున్నారని ఎన్‌బీసీ ఓ నివేదికలో తెలిపింది. అంతేకాకుండా ఇటీవల అమెరికాలో ఓ జిల్లా స్కూల్ డేటా బేస్ నుంచి విద్యార్థుల వివరాలను కాజేశారని తెలిపింది. మాల్ వేర్ సహాయంతో పిల్లల పేర్లు, సోషల్ సెక్యూరిటీ నంబర్లను కొట్టేశారు. ఇదే తరహాలో హ్యాకర్లు ఈ ఏడాదిలోనే దాదాపు 1200 స్కూళ్ల డేటా బేస్‌ను దొంగలించారని వారు తెలిపారు. దొంగలించిన వివరాలను అడ్డుపెట్టుకొని హ్యాకర్లు విద్యార్థులను డబ్బులు డిమాండ్ చేస్తున్నారని, ఇవ్వని వారి వివరాలను డార్క్ వెబ్‌లో అమ్మేస్తున్నారని వారి విచారణలో తేలింది. ఈ విధంగా డార్క్ వెబ్‌లో పెట్టే వివరాలతో అనేక నేరాలు జరిగే అవకాశం లేక పోలేదని, కాబట్టి ప్రతి స్కూల్ వారు అప్రమత్తంగా ఉండాలని వారు సూచిస్తున్నారు. త్వరలోనే ఆ నిందితులను పట్టుకుంటామని వారు తెలిపారు.
1 thought on “స్కూళ్లనే టార్గెట్ చేసుకున్న hackers.. ఇప్పటికే 1200 స్కూళ్లపై దాడులు”