మనోస్థైర్యానికి నిలువెత్తు రూపం ఈ Elephant.. మనలా కాదు..


ఒక చిన్న Elephant పిల్ల కథ ప్రస్తుతం సోషల్ మీడియాను ఊపేస్తోంది. ప్రతి ఒక్కరికీ మార్గదర్శకంగా నిలుస్తోంది. చిన్న సమస్య వస్తేనే ఏం చేయాలో తెలియక డిప్రెషన్‌లోకి వెళ్లిపోయే ప్రతి ఒక్కరికీ ఇన్స్పిరేషన్ అవుతోంది. సాధారణంగా ప్రతిఒక్కరం మనకు చిన్న కష్టం వచ్చిందంటే దాని గురించి తీవ్రంగా ఆలోచిస్తాం. అదే ఓ రోగమైతే మన మనస్థాపానికి అడ్డులేదు. చివరికి ఆత్మహత్యలు చేసుకునేవారూ లేకపోలేదు.
వీరందరికీ ఓ ఏనుగు పిల్ల కెర్రియో మనోధైర్యాన్ని ఇస్తుంది. కెర్రియోకు వెనుక రెండు కాళ్ళు పనిచేయవు. పక్షవాతం రావడంతో వెనుక కాళ్ళు నిస్తేజం అయ్యాయి. కానీ కెర్రియో మాత్రం తాను నడవాలని నిశ్చియించుకుంది. అందుకోసమని ఎంతో కష్టపడుతుంది. తన సంరక్షకుడి సహాయంతో తన వ్యాధితో పోరాడుతోంది. కెర్రియో సంకల్పానికి వ్యాధి భయపడి పారిపోయింది.
ప్రస్తుతం కెర్రియో నడిచేందుకు ప్రయత్నిస్తుంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుంది. ఈ వీడియో చూసిన నేటిజన్లు కెర్రియో యూ ఆర్ గ్రేట్, కెర్రియో యు ఆర్ మై ఇన్స్పిరేషన్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
1 thought on “మనోస్థైర్యానికి నిలువెత్తు రూపం ఈ Elephant.. మనలా కాదు..”