Warning: sprintf(): Too few arguments in /home/ff4q68c69pqk/public_html/wp-content/themes/covernews/lib/breadcrumb-trail/inc/breadcrumbs.php on line 253

చదువు చెప్పే టీచర్.. ఒక్క పనితో ఆ గ్రామానికే దేవుడయ్యాడు..!

Teacher Brought light to Village | ఆ గ్రామానికి కరెంట్ అంటే తెలియదు. 44ఏళ్లుగా అక్కడి ప్రజలు అంధకారంలోనే బతికేస్తున్నారు. కానీ వాళ్ల జీవితంలో ఓ టీచర్

Spread the love
Teacher Brought light to Village
Teacher Brought light to Village

Teacher Brought light to Village | ఆ గ్రామానికి కరెంట్ అంటే తెలియదు. 44ఏళ్లుగా అక్కడి ప్రజలు అంధకారంలోనే బతికేస్తున్నారు. కానీ వాళ్ల జీవితంలో ఓ టీచర్ వెలుగులు నింపాడు. తరతరాలుగా చీకట్లలో జీవిస్తున్న వారి జీవితాల్లో కాంతులు నించాడు. అతడి పేరు జాన్ ఖాంగ్‌న్యూ. భారత్-మయన్మార్ సరిహద్దుల్లో నాగాలాండ్‌లోని షిన్యూ గ్రామం అది. ఎప్పుడో 44 ఏళ్ల క్రితం 1977లో ఏర్పడింది. దాదాపు 60 కుటుంబాలు ఆ గ్రామంలో నివశిస్తున్నాయి.

ప్రపంచం మొత్తం టెక్నాలజీలో ఇంతలా దూసుకుపోతున్నా.. అక్కడి ప్రజలకు కనీసం కరెంట్ అంటే ఏంటో కూడా తెలీదు. రాత్రయితే అంతా అంధకారమే. అలాంటి గ్రామానికి స్కూల్ టీచర్‌గా వెళ్లాడు జాన్. ఆ గ్రామం పరిస్థితి చూసి ఏదైనా చేయాలనుకున్నాడు. షింన్యూ గ్రామ దుస్థితిని వివరిస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. అతడు చేసిన ఆ ఒక్క పోస్ట్ ఆ గ్రామం తలరాత మార్చేసింది.

2019లో గ్లోబల్ హిమాలయన్ ఎక్స్‌పెడిషన్(GHE)కు జాన్ పోస్ట్ చేరింది. ప్రజా జీవనానికి దూరంగా ఉండే గ్రామాల్లో మైక్రో సోలార్ గ్రిడ్స్ ఏర్పాటు చేస్తుంటుంది జీహెచ్‌ఈ. జాన్ పోస్ట్ చూడగానే వెంటటనే అతడిని సంప్రదించింది. ఆ గ్రామానికి విద్యుత్ తీసుకొస్తామని మాటిచ్చింది. దీనికి దాదాపు రూ.23లక్షలు ఖర్చవుతాయని అంచనా వేసింది. షిన్యూ గ్రామ అభివృద్ధికి స్థానిక మాన్ జిల్లా పాలనశాఖ కూడా చేతులు కలిపింది.

రెండేళ్లు కూడా గడవకముందే.. ఈ ఏడాది అంటే.. 2021 ఫిబ్రవరి 16 నాటికి ఆ గ్రామం మొత్తం విద్యుత్ వెలుగులతో నిండిపోయింది. ఇప్పుడు ప్రతి ఇంటికీ 170 వాట్ల సోలార్ ప్యానెల్ ఉంది. ఓ బ్యాటరీ. మొబైల్ చార్జింగ్ పాయింట్స్. రెండు ట్యూబ్ లైట్లు. మూడు ఎల్‌ఈడీ బల్బులు లేని ఇల్లే లేదు. ఇక గ్రామంలో దాదాపు 11 సోలార్ వీధి లైట్లు కూడా ఏర్పాటు చేశారు.

ఈ విషయంగా గ్రామస్థులంతా జీహెచ్‌ఈకి ఎంత కృతజ్ఞత చెబుతారో.. అంతకుమించి జాన్‌కు రుణపడి ఉంటామని అంటారు. విద్యార్థులకు చదువులు చెప్పి వారి జీవితాల్లో వెలుగులు నింపుతారనుకుంటే.. మొత్తం గ్రామం తలరాతనే మార్చేసిన ఈ టీచర్‌ నిజంగా గ్రేట్ కదా..!

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *