James Bond వాడే కారు కావాలా?.. కొనాలంటే ఇదే ఛాన్స్!
James Bond అంటే ఇష్టం ఉండని వారు, తెలియని వారు ఉండరనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ప్రపంచంలోని అత్యధిక మంది జేమ్స్‌బాండ్‌లా అవ్వాలని అనుకునే ఉంటారు. అంతేకాదు జేమ్స్‌బాండ్ అవ్వాలంటే ఏం చేయాలని, ఎలా అవ్వాలని రీసెర్చ్‌లు చేసిన వారు కూడా ఉన్నారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు జేమ్స్‌బాండ్ రేంజ్ ఏంటో. అయితే పాపులారిటీలో జేమ్స్‌బాండ్‌కు పోటీ ఓకే ఒకటి. దాన్ని పొందాలని కూడా ఎంతోమంది ప్రయత్నాలు చేశారు. అదే జేమ్స్‌బాండ్ కారు. ప్రతి జేమ్స్‌బాండ్ సినిమాలో హీరో నడిపే కారు అత్యాధునిక ఫ్యూచర్లతో అందరినీ ఆకట్టుకుంటాయి. సినిమా చూసే ప్రేక్షకులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తుంటాయి.
తాజాగా ఈ కారును అమ్మకానికి పెట్టిందో ప్రముఖ కార్ల కంపెనీ. ప్రతి జేమ్స్‌బాండ్ సినిమాలో కనిపించే కారుని ప్రముఖ సంస్థ ఆస్టన్ మార్టిన్ కంపెనీనే తయారు చేస్తుంది. కొత్తగా విడుదలకు సిద్ధమవుతున్న ‘నో టైం టు డై’ చిత్రంలో కూడా జేమ్స్‌బాండ్ కోసం ఒక ప్రత్యేకమైన కారును సిద్ధం చేసింది. ఈ కారుకి డీబీ 5 జూనియర్ అని నామకరణం కూడా చేసింది. ఇక్కడ ఇంకో ట్విస్ట్ కూడా ఉంది. ఈ కారు ఎలక్ట్రిక్ వాహనం. ఒక్కసారి చార్జ్ చేస్తే 80 మైళ్లు ప్రయాణం చేయొచ్చు. ఆస్టన్ కంపెనీ దాదాపు 125 డీబీ 5 జూనియర్ కార్లను అమ్మకానికి పెట్టింది.
ఒక్కో కారు ధర 90 వేల డాలర్లుగా నిర్ణయించింది. అయితే దీన్ని ఎవరుపడితే వారు కొనుగోలు చేయలేరు. కేవలం ఆస్టన్ మార్టన్ సభ్యత్వం ఉన్నవారు మాత్రమే కొనుగోలు చేయగలరు. అంతేకాదండోయ్ కారును కొన్నాం కాదా అని రోడ్డు మీద రయ్యుమంటూ పోవడం కుదరదు. ఎందుకంటే ఈ కారులో డిజిటల్ నెంబర్ ప్లేట్ ఉంటుంది. అంటే ఒక్క బటన్ నొక్కగానే కారు నెంబర్ మారిపోతుంది. దాంతో పాటుగా మరో స్విచ్ నొక్కితే సినిమాల్లో చూసినట్లు హెడ్ లైట్ల స్థానంలో గన్నులు ప్రత్యక్షం అవుతాయి. రావడంతోనే బులెట్ల వర్షం కురిపిస్తాయి. ఈ కారుని కేవలం ప్రత్యేక కార్యక్రమాల్లో, రేస్ ట్రాక్‌లపైన నడపడానికి మాత్రమే అనుమతులు ఉన్నాయి. అలా కాదని ఎవరైనా రోడ్డుపై ఈ కారుతో కనిపిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం పక్కా అని సంస్థ వారు తెలిపారు.
1 thought on “James Bond వాడే కారు కావాలా?.. కొనాలంటే ఇదే ఛాన్స్!”