

Christian Gilly | ప్రపంచ జూనియర్ షూటింగ్ ఛాంపియన్ క్రిస్టియన్ గిల్లీ ఇకలేరు. అయన గన్నే అయన పాలిట యమపాశం అయ్యింది. ఇటీవల వేటకు వెళ్లిన గిల్లీ అక్కడే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.
ఇటలీ పిసా ప్రొవిన్స్‌లోని మౌంటెకటిని వాల్ ది కెకినా దగ్గరి అడవిలో తన స్నేహితులతో కలిసి వేటకు వెళ్లారు. అక్కడే కిందపడిన బులెట్ కాట్రేజ్‌ను తీసేందుకు వంగగా ప్రమాదవశాత్తు గన్ను పేలింది. దాంతో బుల్లెట్ ఆయన పొత్తికడుపులోకి దిగింది.
అది చూసిన ఆయన స్నేహితులు వెంటనే గిల్లీని కెకినాకు దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు గిల్లీ చికిత్స అందించారు. కానీ ఆయన ఆసుపత్రికి చేరుకున్న కొద్ది సేపటికే మరణించారు.
ఈ విషయాన్ని ఇటలీ షూటింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడు లుసియానో రోసి తెలిపారు. అతడి మరణం ఇటలీ షూటింగ్ ఫెడరేషన్‌ను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని ఆయన అన్నారు.
ఇదిలా ఉంటే క్రిస్టియన్ గిల్లీ గతేడాది అక్టోబర్‌లో ప్రపంచ జూనియర్ క్లే పిజియన్ షూటింగ్ ఛాపింయన్ షిప్‌ను గెలిచారు. అదే విధంగా గతేడాది పెరులో జరిగిన ప్రపంచ కప్‌లో మూడవ స్థానంలో నిలిచారు. గతేడాది మే నెలలో జరిగిన యూరోపియన్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణపతకం సాధించారు.
#ShootingChampion #CristianeGilli #WorldJuniorShootingChampion