Virat Kohli | ఫ్యాన్‌కి బర్త్‌డే విష్ చేసిన విరాట్.. వీడియో వైరల్

ViratKohli

Virat Kohli | ఇండియాలో క్రికెట్ అనేది ఓ ఆట కాదు.. మతం. క్రికటర్లను దేవుళ్లుగా పూజిస్తారు ఇక్కడ. అలాంటి దేవుళ్లు కనీసం తిరిగి మావైపు చూస్తే చాలనుకుంటారు. అదే చేయి ఊపితే ఎగిరి గంతేస్తారు.
హాయ్ అంటే వాళ్ల ఆనందానికి అవధులుండవు. వీటన్నింటికీ మించి ఎవరి బర్త్‌డే రోజైనా ఓ క్రికెటర్ విష్ చేస్తే ఆ అభిమాని ఆనందానికి అవధులుండవు. ఇక ఆ విష్ కూడా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ నుంచి వచ్చిందంటే ఆ ఫ్యాన్‌కి ఇంకేం కావాలి..? సరిగ్గా ఇదే జరిగింది. ముంబైలోని హోటల్లో.
కివీస్‌తో సిరీస్ ముగిసిన తర్వాత టీమిండియా ఆటగాళ్లు హోటల్ వెకేట్ చేసి వెళ్లిపోతున్నారు. అప్పుడే అక్కడున్న ఓ ఫ్యాన్.. ‘ఈ రోజు తన బర్త్‌డే’ అని రాసి ఉన్న ఓ పోస్టర్ పట్టుకున్నాడు. విరాట్ కోహ్లీ మెట్లు దిగుతూ కిందకు రాగానే.. ‘ఆల్ ది బెస్ట్ విరాట్’ అని చెప్పాడు.
అది విన్న విరాట్‘థ్యాంక్యూ’ అని చెప్పి అతడి వైపు తిరిగాడు. అప్పుడే ‘ఈ రోజు తన బర్త్ డే’ అని అతడు చెప్పాడు. వెంటనే విరాట్ కోహ్లీ అతడికి ‘హ్యాపీ బర్త్ డే’ అంటూ పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
https://www.facebook.com/100000941104210/videos/964737941059169/
#ViratKohli #TeamIndia #Mumbai #Fans