

Virat Kohli | ఇండియా-సౌత్‌ఆఫ్రికా మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ ఆసక్తికరంగా సాగుతున్న విషయం తెలిసిందే. తొలి ఇన్నింగ్స్‌లో ఇండియా 327 పరుగులు చేసింది. ఈ ఇన్నింగ్స్‌లో విరాట్ కోహ్లీ 37 పరుగులు చేశాడు. అయితే రెండో ఇన్నింగ్స్‌లో 18 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో అవుటైన తర్వాత డ్రెస్సింగ్ రూంలోకి వెళ్లిన కోహ్లీ.. ఒంటరిగా అద్దంలో నుంచి చూస్తూ నిలబడ్డాడు. జైంట్ స్క్రీన్‌లో కోహ్లీ అవుటైన తీరును చూపించగా కోహ్లీ ఆ వీడియోను చూస్తూ.. తీవ్ర నిరాశకు గురవ్వడం ఈ వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది.

కాగా.. విరాట్ కోహ్లీ రెండో ఇన్నింగ్స్‌లో దూరంగా వెళుతున్న బంతిని షాట్ ఆడటానికి ప్రయత్నించడంతో, బంతి బ్యాట్ ఎడ్జ్ తీసుకుని కీపర్ చేతిలో పడింది. అయితే మొదటి ఇన్నింగ్స్‌లో కూడా విరాట్ ఇదే తరహాలో అవుటయ్యాడు. దీంతో విరాట్ ఆటతీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
#INDvsSA #ViratKohli #ViralVideo #INDvsSA1stTest