

Virat kohli | టీమిండియా టెస్ట్ కెప్టెన్, మాజీ వన్డే, టీ20 కెప్టెన్ విరాట్ కోహ్లీ తన మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడా..? ఎవరికీ ఎలాంటి రెస్పన్స్ ఇవ్వడం లేదా..? అంటే అవుననే చెబుతున్నాడు కోహ్లీ చిన్ననాటి కోచ్ రాజ్‌కుమార్.

ఈ మధ్యనే టీ20 జట్టు కెప్టెన్సీ నుంచి తప్పుకున్న కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి కూడా బీసీసీఐ తప్పించిన విషయం తెలిసిందే. అయితే కోహ్లీకి చెప్పకుండానే వన్డే కెప్టెన్సీ నుంచి అతడిని తొలగించినట్లు పుకార్లు వచ్చాయి. ఇదే విషయంపై బీసీసీఐ కూడా స్పందించి కోహ్లీ తమ మాట వినకుండా టీ20 కెప్టెన్సీని వదిలేశాడని, అయితే వైట్ బాల్ కెప్టెన్సీ ఒక్కరి చేతుల్లోనే ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతోనే వన్డే కెప్టెన్సీ నుంచి కూడా అతడిని తప్పించామని ప్రకటించింది. ఈ ప్రకటన తర్వాత దీనిపై కోహ్లీ అభిప్రాయం కోసం అనేకమంది మీడియా ప్రతినిథులు ప్రయత్నించారట. కానీ కోహ్లీ మొబైల్ స్విచ్ ఆఫ్ వస్తోందని వాళ్లు కూడా చెబుతున్నారు.

ఇక తాజాగా కోహ్లీ చిన్ననాటి కోచ్ రాజ్‌కుమార్ కూడా ఇదే విషయాన్ని చెప్పడంతో ఈ విషయం నిజమని తేలింది. ‘కోహ్లీని కెప్టెన్సీ నుంచి తొలగించిన తర్వాత అతడితో మాట్లాడాలని కాల్ చేశా. కానీ అతడి స్విచ్ ఆఫ్ వచ్చింది’ అని చెప్పాడు. అలాగే కోహ్లీని కెప్టెన్సీ నుంచి తప్పించడానికి గంగూలీ చెప్పిన కారణాన్ని కూడా ఆయన కొట్టిపారేశారు. ‘నాకు తెలిసి కోహ్లీకి గంగూలీ ఏమీ చెప్పలేదు. అసలు కోహ్లీని ఎందుకు తప్పించారో కారణాలను సెలక్షన్ కమిటీ చెప్పలేదు. కానీ గంగూలీ అలా చెప్పడం ఆశ్చర్యం కలిగించింది’ అని రాజ్‌కుమార్ చెప్పారు.
#ViratKohli #TeamIndia #SouravGanguly #RajKumar #BCCI