

Tadap | పాయల్ రాజ్‌పుత్‌కి ప్రత్యేక ఫ్యాన్ బేస్ తెచ్చిన సినిమా ఆర్ఎక్స్ 100. అరంగేట్రంతోనే అమ్మడు కుర్రకారుని కట్టిపడేసింది. ఈ సినిమాను ప్రస్తుతం హిందీలో ‘తడప్’ పేరుతో రీమేక్ చేస్తున్నారు. ఈ రీమేక్ సినిమాలో హీరోయిన్ పాత్రలో తారా సుతారియా నటిస్తోంది. అయితే తడప్ సినిమాలో చేయాలని తాను కోరుకున్నట్లు పాయల్ తెలిపింది.
ఇటీవల జరిగిన ఇంటర్వ్యూలో పాయల్ ‘తడప్’ సినిమాపై తన అభిప్రాయం తెలిపింది. ‘ఈ సినిమాలో చేయాలని నేను కోరుకున్నాను. కానీ కుదరలేదు. ఎవరిని తీసుకోవాలన్నది మేకర్స్ చాయిస్ కదా. అయినా సినిమా క్యాస్ట్ చాలా అద్భుతంగా ఉంది. సినిమా పక్కా హిట్ అవుతుంది. అయినా ఈ సినిమాలో ఛాన్స్ అంటే ఎవరు వద్దంటారు చెప్పండి’ అని చెప్పింది.
ఇది కూడా చదవండి: Pawan Kalyan | పవన్ సినిమా నుంచి హీరోయిన్ అవుట్.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్
దీనిపై తారా సుతారియా స్పందిస్తూ.. ఈ సినిమాలో నాకు అవకాశం ఇచ్చినందుకు మేకర్స్ ధన్యవాదాలు, అలాగే సో.. సారీ పాయల్’ అని తన క్షమాపణ చెప్పింది. అయితే భారీ అంచనాలతో విడుదల కానున్న ‘తడప్’ ప్రేక్షకులను మెప్పిస్తుందా లేదా అన్నది చూడాలి.