

Jai Bhim | తమిళ స్టా్ర్ హీరో సూర్య ‘జై భీమ్’ సినిమాతో సంచలనాలు సృష్టించాడు. ఆ సినిమాతో మంచి జోరందుకున్న సూర్య మరో సినిమాను ఓకే చేశాడు. దాదాపు 20 ఏళ్ల క్రితం చేసిన దర్శకుడు బాలాతో మరోసారి చేసేందుకు సిద్దమవుతున్నాడు. ఈ కాంబోలో సినిమా రానున్న విషయం చాలా రోజులుగా తమిళ సినీ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతున్నాయి.
ఈ సినిమాను కూడా సూర్యనే నిర్మి్స్తున్నాడు. అయితే ఇందులో హీరోయిన్‌గా ఎవరు చేయనున్నారని అభిమానులు జుట్టుపీక్కుంటున్నారు. దీనిపై ప్రస్తుతం నెట్టింట ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా కోసం సూర్య మిస్ ఇండియా బ్యూటీని రంగంలోకి దించనున్నాడని, ఆమె గ్రీన్ సిగ్నల్ ఇవ్వడమే తరువాయి అని టాక్ నడుస్తోంది. ఈ మేరకు మేకర్స్ మిస్ ఇండియా బ్యూటీ కీర్తి సురేష్ సంప్రదించారట. ఈ సినిమా చేసేందుకు అమ్మడు సుముఖంగా ఉన్నారని, కీర్తి ఒక్కసారి ఓకే అంటేనే సినిమా చిత్రీకరణ ప్రారంభం చేసేందుకు మేకర్స్ సిద్దంగా ఉన్నారని సినీ సర్కిల్స్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇప్పటివరకు అయితే రాలేదు. మరి త్వరలో ఏమైనా క్లారిటీ వస్తుందేమో వేచి చూడాల్సిందే.ఇదిలా ఉంటే ఈ మూవీకి కీర్తి సురేష్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే సూర్యతో అమ్మడు చేస్తున్న రెండో సినిమాగా ఇది అవుతుంది. అదే విధంగా దర్శకుడు బాలాతో తొలి సినిమా అవుతుంది.2018లో ‘గ్యాంగ్’ సినిమాతో సూర్య, కీర్తి తొలిసారి జతకట్టిన విషయం తెలిసందే. ఈ మూవీ 2డీ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై సూర్య నిర్మాతగా బాలా దర్శకత్వంలో తెరకెక్కనుంది. ఇక సినిమా టైటిల్ విషయానికి వస్తే.. ఈ సినిమాకు నామకరణం అవ్వలేదు. సినిమా టైటిల్ తెలియాలంటే మరికొన్నాళ్లు ఆగాల్సిందే.
1 thought on “జై భీమ్‌తో రొమాన్స్‌కు రెడీ అవుతున్న మిస్ ఇండియా బ్యూటీ..?”