

టాలీవుడ్ యంగ్ హీరో శ్రీవిష్ణు తనదైన స్టైల్‌తో దూసుకుపోతున్నాడు. ఎప్పటికప్పడు కొత్త తరహా కథలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఆశించిన స్టార్‌డమ్ రాకపోయినప్పటికీ ఎంటర్‌టైన్ చేయడం ఆపట్లేదు. అయితే ఈ యంగ్ హీరో ఈ ఏడాది చివరికి మళ్లీ బిగ్ స్క్రీన్స్‌పై కనిపించి అందరినీ అలరించేందుకు సిద్దమయ్యాడు.
శ్రీవిష్ణు తాజాగా చేస్తున్న ‘అర్జున ఫల్గుణ’. ఈ సినిమా డిసెంబర్ 31కి ప్రేక్షకుల ముందుకు రానుంది. మూవీ టీమ్ ఈ మేరకు పోస్టర్‌ను రిలీజ్ చేసింది. ఈ పోస్టర్‌లో శ్రీవిష్ణు, మహేష్ ఓ సంచిలోకి చూస్తున్నారు. దీంతో సినిమా ఇంట్రెస్టింగ్‌గా ఉండనుందని అర్థం అవుతోంది.
అయితే ఈ సినిమాలో అమృత అయ్యర్ హీరోయిన్‌గా నటిస్తుండగా సుబ్బరాజు, నరేష్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని తేజ మార్ని దర్శకత్వంలో నిరంజన్ రెడ్డి, అవేశ్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా అందరినీ ఆకట్టుకుంటుందని మూవీ టీమ్ ధీమాగా ఉంది. మరి సినిమా వారు ఆశించిన ఫలితాలు ఇస్తుందో లేదో తెలియాలంటే డిసెంబర్ 31 వరకు ఆగాల్సిందే.
#Sree vishnu #AmrithaAyyar #ArjunaPhalguna