Sonusood | అభిమాని ఆర్ట్‌కి సోనూసూద్ ఫిదా.. అదిరిపోయే ఆర్ట్


Sonusood | బాలీవుడ్ నటుడు సోనూసూద్ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఓ హీరో. కొంతమంది ఏకంగా దేవుడిలా కొలుస్తున్నారు కూడా. కాస్మెర్ నుంచి కన్యాకుమారి వరకు సోనూను అభిమానించే వాళ్ళు ఉన్నారంటే సందేహం లేదు. అలాంటి అభిమానుల్లో ఓ అభిమాని సోనూసూద్ కు ఓ అరుదైన బహుమతి ఇవ్వాలని నిర్ణయించున్నాడు. దీంతో స్వయంగా తన స్వహస్తాలతో సోనూ బొమ్మను చిత్రీకరించాడు.
వేదాంత్ శుక్లా అనే కుర్రాడు.. 4 అడుగుల పొడవు, 2.6 అడుగుల వెడల్పు ఉన్న వస్త్రంపై సోనూ బొమ్మను ఎంబ్రాయిడరీ చేశాడు. ఆ వీడియో ట్విటర్‌లో పోస్ట్ చేసిన వేదాంత్.. దీనికోసం దాదాపు 200 గంటలకు పైగా కష్టపడ్డానని, కలిసి ఇది అందించాలని ఉందని సోనూసూద్‌ను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ చూసిన సోనూ.. ‘నువ్వు సూపర్ మిత్రమా.. చెప్పు ఎప్పుడు కలుద్దాం’ అని రీట్వీట్ చేశాడు. ఇప్పుడీ వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది.
ఇదిలా ఉంటే రియల్ హీరో సోనూసూద్‌కి దేశ వ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారన్న విషయ. తెలిసిందే. వాళ్లలో అనేకండిమంది సోనూకు మెసేజ్‌లు, వీడియోలు పంపి అభిమానాన్ని చాటుకుంటే.. ఇంకొంతమంది ఏకంగా ఆలయాలు కట్టించి, విగ్రహాలు ప్రతిష్ఠించి తన ప్రేమను ప్రకటించారు.