Akhanda | అఖండ అదుర్స్.. మా వల్ల కాదంటున్న అమెరికా థియేటర్లు..

Akhanda
Akhanda

‘అఖండ’ ప్రస్తుతం ట్రెండ్ అవుతున్న పేరు. దానికి తోడు ఇది నందమూరి నటసింహం బాలయ్య సినిమా కూడా. వీటన్నింటికి తోడుగా ఈ సినిమాకి బోయపాటి శ్రీను. సాధారణంగానే బాలయ్య, బోయపాటి కాంబో అంటే అభిమానులకి పూనకాలు వస్తాయి. అయితే ‘అఖండ’ సినిమాతో బాలయ్య ఫ్యాన్స్‌కే కాదు ప్రతి తెలుగు వాడికి, సినిమా ప్రియుడికి పూనకాలు వచ్చాయి.

‘అఖండ’ డిసెంబర్ 2న ప్రపంచ వ్యాప్తంగా విడుదలయ్యి కలెక్షన్లను ఊచకోత కోతుస్తున్న విషయం తెలిసిందే. బాలయ్య సినిమా అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆమాత్రం ఉంటుంది. అయితే అఖండ మాత్రం ఓవర్సిస్‌లోను దుమ్ము రేపుతోంది. అక్కడి థియేటర్లు సైతం హౌస్ ఫుల్ అవుతున్నాయి. ఈ సినిమాలో డైలాగ్‌లకు విమర్శకులు సైతం ఫిదా అయ్యారు.

సినిమా బీజేఎమ్, మ్యూజిక్ అన్నీ అదిరిపోయాయని ప్రతి ప్రేక్షకుడు చెబుతున్నారు. కానీ అమెరికా థియేటర్లు మాత్రం బాలయ్య దెబ్బకి బెంబేలిత్తిపోతున్నాయి. ఈ క్రమంలో ఓ థియేటర్ వాళ్లు అఫీషియల్ నోటీసు కూడా విడుదల చేశారు. బాలయ్య ‘అఖండ’ సినిమా బీజీఎమ్‌లను మా స్పీకర్లు తట్టుకోలేకపోతున్నాయి. ఈ సినిమాలోని బీజేఎమ్‌ను పూర్తి సౌండ్‌లో ప్లే చేస్తే మా స్పీకర్లు కచ్ఛితంగా చెడిపోతాయనిపిస్తోంది.

దయచేసి బాలయ్య అభిమానులు ఈ విషయాన్ని గమనించగలరు. అని ఆ సోటీసులో పేర్కొంది. ప్రస్తుతం ఈ నోటీసు నెట్టింట వైరల్ అవుతోంది. బాలయ్య అభిమానులైతే ‘అఖండ’ అమెరికాను కూడా వణికించి, అది మా బాలయ్య దెబ్బంటే అని సినిమాను కొనియాడుతున్నారు.

Spread the love

1 thought on “Akhanda | అఖండ అదుర్స్.. మా వల్ల కాదంటున్న అమెరికా థియేటర్లు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *