

Shocking | క్రికెట్లో స్లెడ్జింగ్‌కి పెట్టింది పేరు ఆస్ట్రేలియా-ఇంగ్లండ్. అలాగే అతిగా ప్రవర్తించడం, బూతులు తిట్టడం ఇవి కూడా వాళ్లకు వెన్నతో పెట్టిన విద్య. తాజాగా ఆసీస్ ఆటగాడు ట్రావిస్ హెట్ ఇలాంటి పనే చేశాడు. మ్యాచ్ జరుగుతున్న సందర్భంలో బ్యాటింగ్ చేస్తూ బూతులు తిట్టాడు. ఈ బూతులు కాస్తా స్టంప్ మైక్‌లో రికార్డయ్యాయి. దీంతో అతడి మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత విధిస్తున్నట్లు మ్యాచ్ రిఫరీ డేవిడ్ బూన్ ప్రకటించాడు.
యాషెస్ సిరీస్‌లో భాగంగా ఆసీస్-ఇంగ్లండ్ మధ్య తొలి టెస్ట్ జరుగుతున్న విషయం తెలిసిందే. బ్రిస్బేన్‌లో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఆసీస్ మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ ట్రావిస్ హెడ్ బ్యాటింగ్ బూతులు తిట్టాడు. ఇన్నింగ్స్ 77వ ఓవర్లో ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ విసిరిన బంతిని పుల్ చేయబోయిన ట్రావిస్ మిస్ అయ్యాడు. దీంతో అసభ్య పదజాలంతో తిట్టాడు. ఈ తిట్టు స్టంప్ మైక్‌లో రికార్డయింది. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
#AshesSeries #AUSvsENG #TravisHead #BenStokes