

డాన్స్ మాస్టర్, కొరియోగ్రాఫర్ శివ శంకర్ మాస్టర్ ఆదివారం రాత్రి 8 గంటలకు కన్ను మూశారు. దీంతో ఆయన కుటుంబం కన్నీరుమున్నీరవుతున్నారు. అయితే ఆయన అంత్యక్రియలను రేపు మధ్యాహ్నం 2 గంటలకు మహాప్రస్థానంలో నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. అభిమానుల సందర్శనం కోసం ఆయన భౌతిక కాయాన్ని మణికొండ పంచవటి కాలనీలోని నివాసానికి తరలించనున్నట్లు తెలిపారు. అయితే ఈ విషాద వార్త విన్న అనంతరం కొందరు ప్రముఖులు తమ నివాళులు అర్పించారు. మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్, రాజమౌళి పలువురు సోషల్ మీడియా వేదికగా తమ సంతాపం తెలిపారు.
Shiva Shankar Master | ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. శివ శంకర్ మాస్టర్ ఇకలేరు..
అయితే శివ శంకర్ మాస్టర్ తన సినీ జీవితంలో ఎన్నో అవార్డులు అందుకున్నారు. తన డాన్స్ ప్రతిభతో ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక హోదా సంపాదించుకున్నారు. అంతేకాకుండా 2011లో వచ్చిన ‘మగధీర’ సినిమాలోని ‘ధీర ధీర ధీర’ పాటకు జాతీయ అవార్డు అందుకున్నారు. అదే విధంగా నాలుగు తమిళనాడు రాష్ట్ర అవార్డులను అందుకున్నారు. ఆయన తన కెరీర్‌లో దాదాపు 800 వందల సినిమాలను కొరియోగ్రఫీ చేశారు. 30 సినిమాల్లో నటించారు.
అనేక టీవీ షోలలో న్యాయనిర్ణేతగా వ్యవహరించారు. అయితే 1983లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన ‘ఖైదీ’ సినిమాలో సూపర్ హిట్ సాంగ్ ‘రగులుతుంది మొగలి పొద’ పాటతో శివ శంకర్ మాస్టర్ తెలుగు చిత్రసీమలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత మళ్లీ 1995లో వచ్చిన ‘అమ్మోరు’ సినిమాకి కొరియోగ్రఫీ చేశారు.
ఇది కూడా చదవండి: Salman Khan | ‘అలా వేస్ట్ చేయకండి’.. ఫ్యాన్స్‌కు సల్మాన్ రిక్వెస్ట్