Shakib Al hassan | గ్రౌండ్‌లో వర్షం.. చిన్న పిల్లాడిలా షకిబ్.. వైరల్ వీడియో

Shakib Al Hassan

Shakib Al hassan | పాకిస్థాన్-బంగ్లాదేశ్ మధ్య జరగాల్సిన రెండో మ్యాచ్ రెండో రోజు ఆటను వర్షం కారణంగా నిలిపేశారు. భారీ వర్షం పడడంతో గ్రౌండ్ నీటిలో మునిగిపోయింది. గ్రౌండ్ తరడకుండా పరిచిన కవర్లపై నీరు నిలబడింది.
అయితే ఇది చూసిన బంగ్లా ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ చిన్న పిల్లాడిలా మారిపోయాడు. ఆ కవర్లపై దూకి జారుతూ సరదాగా గడిపాడు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

టెస్ట్ మ్యాచ్ రెండో రోజు ఆటను నిలిపేయడంతో.. పిచ్ కవర్‌లతో మైదానాన్ని కప్పేశారు. అయితే ఆ కవర్లు కూడా తడిసిపోయాయి.
అలా తడిసిన కవర్ల వద్దకు పరుగెత్తుకుంటూ వెళ్లి వాటిపై జారాడు. మైదానంలో ఇతర ఆటగాళ్లు ఎవరూ లేనప్పుడు అతను సరదాగా గడుపుతున్న వీడియోనే ఇది.
ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో ప్రస్తుతం పాకిస్థాన్ 2 వికెట్లు కోల్పోయి 188 పరుగులతో బ్యాటింగ్ చేస్తోంది. తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్ చేతిలో బంగ్లాదేశ్ ఓడిపోయింది.
#ShakibAlHassan #Bangladesh #ViralVideo #Pakistan