

Vijay Devarakonda | రౌడీ హీరో విజయ్ దేవరకొండకు దేశవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. అర్జున్ రెడ్డి సినిమాతో యావత్ భారత్‌దేశాన్ని ఓ ఊపుఊపేసిన ఈ యంగ్ హీరో ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలో చేస్తున్నాడు. మాస్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ‘లైగర్’ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.
విజయ్‌కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. బీటౌన్ హీరోయిన్లలోనూ అయ్యగారి అభిమానులు లేకపోలేదు. వారిలో బీటౌన్ హాట్ బ్యూటీ సారా అలీఖాన్ టాప్‌లో ఉంటుంది. అమ్మడికి విజయ్ అంటే పిచ్చి. తాజాగా ‘కాఫీ విత్ కరణ్’ షోలో అమ్మడు పాల్గొంది. ప్రస్తుతం ఈ ఎపిసోడ్ ప్రోమో నెట్టింట వైరల్ అవుతోంది.
ఇందులో ఈ అమ్మడు ‘నీ స్వయంవరంలో హీరోలు ఎవరెవరు పాల్గొనాలి’ అన్న ప్రశ్నకు ‘వరుణ్ ధావన్, విక్కీ కౌశల్, విజయ్ దేవరకొండ, రణ్‌వీర్ సింగ్’ అని పేర్లు చెప్పింది. అనంతరం వీరిలో ముగ్గురికి పెళ్లిళ్లు అయిపోయాయంటూ నవ్వింది. దీంతో అమ్మడు విజయ్‌తో పెళ్లికి రెడీ అని ఇండైరెక్ట్‌గా చెప్తుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
https://youtu.be/tWn53PT7EAA
#SaraAliKhan #VijayDevarakonda #Liger