

Sai Dharam Tej | మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ ‘రిపబ్లిక్’ సినిమా తర్వాత రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. దాంతో కొన్నాళ్లుగా ఇంటికే పరిమితమయ్యాడు. సాయి తేజ్ త్వరగా కోలుకోవాలని, తిరిగి సినిమాల్లోకి రావాలని అభిమానులు ప్రార్థనలు చేశారు.
వారు కోరుకున్న విధంగానే సాయితేజ్ మళ్లీ సెట్స్‌పైకి వచ్చేందుకు సిద్దమయ్యాడట. ఈ క్రమంలోనే తాజాగా మరో సినిమాను ఓకే చేశాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాను ‘సీటీమార్’ దర్శకుడు సంపత్ నంది డైరెక్ట్ చేయనున్నాడని టాక్ నడుస్తోంది.
‘రిపబ్లిక్’ ప్లాప్ కావడంతో ఈ సారి ఎలాగైనా హిట్ అందుకోవాలని సాయి తేజ్ గట్టిగా ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇంట్రెస్టింగ్ కథను లాక్ చేశాడని, ఈ సినిమాను ప్రముఖ మూవీ మేకింగ్ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారని సినీ సర్కిల్స్‌లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇప్పటి వరకు రాలేదు. త్వరలోనే మైత్రి మూవీ మేకర్స్ ప్రకటన చేయనున్నారని టాక్ నడుస్తోంది. దీనిపై క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
#SaiDharamTej, #SampathNandi, #Seetimaar, #Republic,