

RRR | ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎదురుచూస్తున్న సినిమాల్లో ‘ఆర్ఆర్ఆర్’ టాప్‌లో ఉంటుంది. ఈ సినిమా విడుదలకు ఇంకెన్ని రోజులున్నాయంటూ అభిమానులు రోజులు లెక్కేస్తున్నారు. దీనికి తగ్గట్టుగానే రాజమౌళి ప్రమోషన్స్ చేస్తూ అభిమానులకు పిచ్చెక్కిస్తున్నాడు.
ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ టీమ్ రాజమౌళి, ఎన్‌టీఆర్, రామ్ చరణ్ ప్రమోషన్స్‌లో భాగంగా ముంబై వెళ్లారు. అక్కడ వారికి భళ్లాలదేవుడు రానా సర్‌ప్రైజ్ ఇచ్చాడు. వారితో కలిసిన రానా ఇంటర్వ్యూల గురించి మాట్లాడాడు. అంతేకాకుండా రాజమౌళిని కాసేపు ఆటపట్టించాడు కూడా.
ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. వీటిని ‘ఆర్ఆర్ఆర్ విత్ ఆర్’ అనే ట్యాగ్‌లైన్‌తో రానా తన ట్విట్టర్‌లో షేర్ చేశాడు. అయితే తన తాజా సినిమా షూటింగ్‌లో భాగంగా ముంబైలో ఉన్న రానా.. ఆర్ఆర్ఆర్ టీమ్ వచ్చిందని తెలయడంతో తన బెస్ట్ ఫ్రెండ్స్‌ను కలిసేందుకు వచ్చాడు.
అయితే బాహుబలితో రానా, రాజమౌళి మధ్య మంచి బంధం ఏర్పడింది. ఇక రామ్ చరణ్, రానా చిన్ననాటి స్నేహితులు, ఎన్‌టీఆర్-రానా కూడా బెస్ట్ ఫ్రెండ్స్ అన్న విషయం అందరికీ తెలుసు. కాబట్టి వీరు కలుసుకోవడం సర్‌ప్రైజ్ కాకపోయినా, వీరిని ఒకే ఫ్రేమ్‌లో చూడటం చాలా బాగుందని ఫ్యాన్స్ అంటున్నారు.
https://twitter.com/RanaDaggubati/status/1473587710166065153?s=20
https://twitter.com/RanaDaggubati/status/1473640321867124738?s=20
#RRR #Rana #NTR #RamCharan #Rajamouli