

దర్శకధీరుడు రాజమౌళి తమిళ మీడియాకు క్షమాపణలు చెప్పారు. తప్పు తనేదని ఒప్పుకున్నాడు కూడా. అయితే ప్రస్తుతం జక్కన్న ఆర్ఆర్ఆర్ సినిమాతో ఫుల్ బిజీగా ఉన్న విషయం తెలసిందే. ఈ సినిమాను రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. పాన్ ఇండియా రేంజ్‌లో విడుదలకు సిద్దమవుతున్నా ఈ సినిమా వరుస అప్‌డేట్‌లతో అదరగొట్టేస్తోంది. ఇటీవల ఆర్ఆర్ఆర్ సోల్ ఆంథెమ్ ‘జనని’ పాట విడుదలయ్యి ఓ ఊపు ఊపేసింది. ప్రతి భాషలోనూ ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. అంతేకాకుండా ఈ పాట టాపిక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా కూడా నిలిచింది. అయితే ఈ పాట విడుదల సందర్భంగానే రాజమౌళి తమిళ తంబీలను క్షమాపణలు అడిగారు. జననీ పాట తమిళ వెర్షన్ ‘ఉయిరే’ విడుదల గురించి చెన్నైలో నిర్వహించిన ఈవెంట్‌ను జక్కన్న హజరయ్యారు.
ఇది కూడా చదవండి: Akhanda | బాలయ్య సీక్రెట్ బోయపాటికే తెలుసు.. స్టార్ డైరెక్టర్
ఈ సందర్బంగా మాట్లాడుతూ. ‘తమిళంలో మా సినిమాను డిస్ట్రిబ్యూట్ చేస్తుందన్నందుకు లైకా ప్రొడక్షన్స్ వారికి ధన్యవాదాలు. అయితే నేను ముందుగా తమిళ మీడియా సోదరులకు క్షమాపణలు చెప్తున్నాను. గత 3 సంవత్సరాలుగా మీతో ఇంటరాక్ట్ కాలేకపోయాను. అది నా తప్పే. తమిళ సినీ మీడియా సోదరులు నన్ను క్షమించాలి. మా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జనవరిలో జరుగుతుంది. అందులో తప్పకుండా తమిళంలోనే మాట్లాడతాన’ని రాజమౌళి హామీ ఇచ్చారు. అంతేకాకుండా ఆర్ఆర్ఆర్ సినిమా ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నానని అన్నారు.
1 thought on “Rajamouli | తమిళ మీడియాకు జక్కన్న క్షమాపణలు.. ఈ సారి పక్కా..”