

Pushpa | రితేష్ దేశ్‌ముఖ్ ఈ పేరుకి పెద్దగా పరిచయం అక్కర్లేదు. స్టార్ అన్న ట్యాగ్ లేకపోయిన బాలీవుడ్‌లోని అగ్రనటుల్లో ఒకడిగా స్థానం సంపాదించుకున్నాడు. మరాఠీ, హిందీ సినిమాల్లో తనదైన ప్రతిభతో ఇండియాలోనే టాప్ 20 నటుల్లో తన పేరును నమోదు చేసుకున్నాడు.
అయితే ఇటీవల రితేష్ చేసిన ఓ ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. టాలీవుడ్ స్టార్ హీరో అల్లుఅర్జున్ గురించి రితేష్ తన ట్వీట్‌లో రాసుకొచ్చాడు. బన్నీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను, అల్లుఅర్జున్‌ను పవర్ ఫుల్ గెటప్‌లో ఎప్పుడెప్పుడు చూస్తానా అని అని ఆత్రుతగా ఉందని రితేష్ తన ట్వీట్‌లో రాసుకొచ్చాడు.
ఇది కూడా చదవండి: RRR | ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ముహూర్తం ఫిక్స్ చేసిన జక్కన్న..
అయితే పుష్ప ట్రైలర్ ప్రోమోతోనే ఉర్రూతలూగించాడు బన్నీ. ఇక ట్రైలర్ ఏరేంజ్‌లో ఉంటుందో ఊహకు కూడా రావడం లేని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో పుష్ప సినిమా ట్రైలర్ డిసెంబర్ 6న విడుదల కానుంది.