

INDvSA 1st Test | రిషబ్ పంత్ రికార్డు బద్దలు కొట్టాడు. ఏకంగా ఎంఎస్ ధోనీని దాటేశాడు. అతి తక్కువ మ్యాచ్‌లలో 100 మందిని ఔట్ చేసిన భారత వికెట్ కీపర్‌గా చరిత్ర సృష్టించాడు.
కెరీర్లో 26వ టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న పంత్.. సఫారీ కెప్టెన్ డీన్ ఎల్గర్, భవుమా, ముల్దర్, రబాడా క్యాచ్‌లు పట్టాడు. దీంతో ఇప్పటివరకు ఉన్న 89 క్యాచులు, 8 స్టంపౌట్లకు ఇవి జత కలవడంతో 100 మందిని అవుట్ చేసినట్లైంది.
అయితే టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ 100 మందిని అవుట్ చేయడానికి 36 టెస్టులు పట్టింది. కానీ రిషబ్ పంత్ కేవలం 26 టెస్టుల్లోనూ ఈ ఫీట్ సాధించడంతో మహీ రికార్డు బద్దలైంది.
ఇక ఈ మ్యాచ్‌లో రిషబ్ పంత్‌తో పాటు మహ్మద్ షమీ, జస్ప్రిత్ బుమ్రాలు కూడా అరుదైన రికార్డులు సాధించారు.

తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీసిన మహ్మద్ షమీ.. టెస్టుల్లో 200 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. టీమిండియా తరుపున ఈ ఫీట్ అందుకున్న 5వ పేసర్‌గా షమి నిలిచాడు.
డీన్ ఎల్గర్ వికెట్ తీసిన జస్ప్రిత్ బుమ్రా, టెస్టు కెరీర్‌లో 100 వికెట్లను పూర్తి చేసుకున్నాడు. 47వ టెస్టులో బుమ్రా ఈ ఫీట్ సాధించాడు. ఇక బుమ్రా.. సౌతాఫ్రికాలోనే తన మొట్టమొదటి టెస్టు వికెట్ సాధించడం విశేషం.
#RishabhPant #JaspritBumrah #MohammadShami #TeamIndia #INDvsSA #MSDhoni #INDvSA1stTest