Record Break| వీడెక్కడి బౌలర్ రా బాబూ.. ఒక్క ఓవర్లో 6 వికెట్లు..?

Record Break

Record Break | ఇప్పటివరకు క్రికెట్లో 6 బంతుల్లో 6 సిక్స్‌లు కొట్టడమే చూసుంటారు. కానీ ఎప్పుడైనా 6 బంతుల్లో 6 వికెట్లు తీయడం చూశారా..?
అయితే ఇప్పుడు అలాంటి ఓ చారిత్రాత్మకమైన ఫీట్ సాధించాడో బౌలర్. భారత సంతతికి చెందిన హర్షిత్ సేథ్ ఈ ఫీట్ సాధించాడు.
ఓ ఓవర్లో హ్యాట్రిక్ తీయడమే అరుదు. హ్యాట్రిక్ తీశాడంటే ఆ బౌలర్‌ని అద్భుతమైన బౌలర్ అంటూ తెగ పొగిడేస్తాం. కానీ హర్షిత్ సేథ్ ఏకంగా ఒకే ఓవర్లో 6 బంతుల్లో 6 వికెట్లు తీసి ఔరా అనిపించాడు.
హర్షిత్ లెఫ్ట్ ఆర్మ్ హాఫ్ స్పిన్నర్. ఢిల్లీకి చెందిన హర్షిత్ సేథ్ కుటుంబం యూఏఈలో స్థిరపడింది. హర్షిత్ యూఏఈ తరపునే అండర్ 19 మ్యాచ్‌లు ఆడుతున్నాడు. ఈ క్రమంలోనే 16 ఏళ్ల హర్షిత్ ఈ రికార్డు సాధించాడు.
యూఏఈలోని దుబాయ్ క్రికెట్ కౌన్సిల్ స్టార్లెట్స్ తరపున ఆడుతున్న హర్షిత్.. 5వ తేదీన పాకిస్తాన్‌కు చెందిన హైదరాబాద్ హాక్స్ అకాడెమీ ఆర్సీజీపై అద్భుత ప్రదర్శన చేశాడు.
4 ఓవర్లలో కేవలం 4 రన్స్ మాత్రమే ఇచ్చి ఏకంగా 8 వికెట్లు పడగొట్టాడు.
అయితే ఇదంతా ఓ ఎత్తయితే.. ఏకంగా ఒకే ఓవర్లో 6 వికెట్లు తీయడంతో ఇప్పుడు హర్షిత్ పేరు తెగ ట్రెండ్ అవుతోంది.
అయితే ఇప్పటివరకు అంతర్జాతీయ క్రికెట్లో లసింగ్ మలింగ్ తీసిన ఓవర్లో 4 వికెట్ల డబుల్ హ్యాట్రిక్ మాత్రమే ఇప్పటివరకు అత్యధికం.
ఇక లోకల్ క్లబ్ మ్యాచ్‌లలో ఆస్ట్రేలియాకు చెందిన అలెడ్ క్యారీ 2017లో ఇదే ఫీట్ సాధించాడు.
అలాగే 1930లో ఇండియాకు చెందిన వైఎస్ రామస్వామి స్కూల్ క్రికెట్లో ఈ రికార్డు సాధించాడని తెలుస్తోంది. ఆ తర్వాత ఇంగ్లీష్ ఆటగాడు జీ సైరెట్ 1951లో ఇదే రికార్డు నెలకొల్పినట్లు చెబుతారు.
ఏది ఏమైనా ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో హర్షిత్ ఓ సంచలనంగా మారాడు. అతడి రికార్డు గురించి క్రికెట్ అభిమానులంతా నెట్టింట్లో తెగ చర్చించుకుంటున్నారు.
#Harshitseth #IndianOrigin #UAE #Under19