

Rajamouli | దర్శకధీరుడు రాజమౌళి అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. తనదైన దర్శకత్వంతో ఈ ఫీట్ సాధించాడు. అయితే రాజమౌళి ‘బాహుబలి’ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాతో తన ప్రతిభను ప్రపంచానికి చాలా చెప్పాడు. అంతేకాకుండా బాలీవుడ్ భారత్‌లో ఒక ఫిలిం ఇండస్ట్రీ మాత్రమే అని, బాలీవుడ్ మాత్రం భారత సినీ పరిశ్రమ కాదని నిరూపించాడు.
బాహుబలి’ విజయంతో ప్రపంచానికి తెలుగు చిత్రసీమను, అందులోని ప్రతిభను పరిచయం చేసిన జక్కన్న.. ఇప్పుడు మరో అరుదైన ఘనతను అందుకున్నాడు. ప్రపంచంలోని గొప్ప ఫిలింమేకర్స్‌తో రాజమౌళి స్థానం సంపాదించుకున్నాడు. ప్రముఖ మ్యాగజిన్ సంస్థ ఇచ్చిన నివేదిక ప్రకారం.. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అతి గొప్ప టాప్50 ఫిలిం మేకర్స్ జాబితాలో రాజమౌళి 25వ స్థానాన్ని సాధించాడు.
అంతేకాకుండా ఈ జాబితాలో స్థానం అందుకున్న ఏకైక భారతీయుడిగా కూడా రాజమౌళి నిలిచాడు. అంతేకాకుండా హీరోను ఎలా ఎలివేట్ చేయడంలో అతడికి అతడే సాటి అని మ్యాగజిన్ రాసుకొచ్చింది.