

మోస్ట్ వాంటెడ్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ ట్రైలర్ లాంచ్ సందర్భంగా మూవీ టీం చెన్నై వెళ్లింది. అక్కడి నుంచి తిరిగి వచ్చిన తరువాత ఆదివారం తెలుగు మీడియాతో మూవీ టీం ముచ్చటించింది. ఈ సందర్భంగా సెట్స్‌లో పరిస్థితి ఎలా ఉండేది అని రాజమౌళి అడగగా.. జక్కన్న షాకింగ్ విషయాలను బయటపెట్టాడు. సెట్స్‌లో ఎన్‌టీఆర్, రామ్ చరణ్ ఎప్పుడూ గొడవ పడుతుంటారని చెప్పి అందరిని ఆశ్చర్యపరిచాడు. ఇద్దరూ ప్రతి ఒక్కరితో ఫ్రెండ్లీగా ఉంటారు. వారు గొడవ పడటమేంటని ఖంగుతిన్నారు.
‘ ఆర్ఆర్ఆర్ సినిమాను నేను 300 రోజులు చిత్రీకరిస్తే అందులో దాదాపు 20-25 రోజులు వీరి గొడవలే ఉంటాయి. వీరిద్దరూ చిన్నపిల్లలు కాదు. 30 దాటి పెళ్లిళ్లు కూడా అయ్యాయి. వీరికి బయట ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ విషయం అందరికీ తెలిసిందే. కానీ వీరు చిన్నపిల్లల చేష్టలు పోనిచ్చుకోలేదు. నేను ఏదైనా పనిలో బిజీగా ఉన్నప్పుడు ఎన్‌టీఆర్ నా దగ్గరకి వస్తాడు. చెర్రీ తనను గిల్లాడని కంప్లెంట్ చేస్తాడు. అటు చూస్తే చెర్రీ తనకేం తెలీదన్నట్టు అమాయకంగా కూర్చుని చూస్తుంటాడు. ఇలా ప్రతి రోజూ నాతో ఆడుకునే వారు. ఆ వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మీరూ చూసే ఉంటారు. వీరి గొడవలతోనే చాలా రోజులు వృధా అయ్యాయి’ అని రాజమౌళి చెప్పుకొచ్చాడు.