Prabhas | రాధేశ్యామ్ నార్త్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఫస్ట్ సింగిల్‌ రెడీ..

Prabhas | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తాజాగా నటించిన సినిమా రాధేశ్యామ్. ఈ సినిమా కోసం దేశవ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల సినిమా నుంచి అప్‌డేట్స్..

Spread the love
Radhe Shyam
Prabhas

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తాజాగా నటించిన సినిమా రాధేశ్యామ్. ఈ సినిమా కోసం దేశవ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల సినిమా నుంచి అప్‌డేట్స్ లేవంటూ ఓ అభిమాని బ్లాక్ మెయిల్ చేసిన విషయం తెలిసిందే. దీంతో మూవీ మేకర్స్ అప్‌డేట్‌ను సిద్దం చేశారు. అనంతరం సినిమా ఫస్ట్ సింగిల్‌ను రిలీజ్ చేశారు. ఈ పాట రిలీజ్ అప్పుడూ కాస్త ఆలస్యం చేసి నిరాశ పరిచినా.. తీరా పాటతో అందరిని ఊహల్లో తేల్చేశారు. అయితే ఇదే ఫస్ట్ సింగిల్ ఇప్పుడు హిందీలో రిలీజ్‌కు సిద్ధం అవుతోంది. ఇక్కడే అసలు విషయం ఉంది.

ఇది కూడా చదవండి: Pushpa | కోసం బరిలోకి పాన్ ఇండియా స్టార్..?

ఈ సినిమా సౌత్, నార్త్ మ్యూజిక్ అస్సలు కలవదు. అంటే తెలుగులో ఉన్న మ్యూజిక్ హిందీలో ఉండదు. దీంతో హిందీలో ‘ఆషికీ ఆగయీ’ అంటూ రిలీజ్ కానున్న ఈ పాట కోసం కూడా అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ పాట ప్రోమో హాట్ టాపిక్ కాగా.. ఫుల్ సాంగ్ డిసెంబర్ 1న విడుదల కానుంది. ఈ పాటతోనే రాధేశ్యామ్ మేకర్స్ సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని టాక్ నడుస్తోంది. ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ముస్తాబవుతోంది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *