

ప్రస్తుతం బుట్టబొమ్మ పూజా హెగ్దే హాట్ టాపిక్‌గా ఉంది. అమ్మడు ఏం చేసినా అది సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. వరుస సినిమాలతో దూసుకుపోతున్న అమ్మడు సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటే అభిమానులను అలరిస్తోంది
అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న పూజ.. తన సినీ కెరీర్ గురించి మాట్లాడింది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో తాను సినిమాలు చేస్తున్నప్పటికీ సొంత భాష కన్నడలో చేయలేకపోవడం కాస్త వెలితిగా అనిపిస్తుందని అమ్మడు చెప్పుకొచ్చింది.
ఇప్పటి వరకు తనకు తగిన పాత్రలు రాలేదని, వస్తే కన్నడలో సినిమా చేసేందుకు సిద్ధంగా ఉన్నానంటూ పూజా తెలిపింది. మరి అమ్మడి ఆశ తీరేలా ఎవరైనా కన్నడ దర్శకుడు మంచి కథతో వస్తాడేమో వేచి చూడాలి.
ఇదిలా ఉంటే ప్రస్తుతం పూజా పాన్ ఇండియా సినిమా ‘రాధేశ్యామ్’లో నటిస్తోంది. ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. దీంతో పాటుగా తమిళ స్టార్ హీరో విజయ్ తాజా సినిమా ‘బీస్ట్’లోనూ బుట్టబొమ్మ హీరోయిన్‌గా నటిస్తోంది. వీటితో పాటు తెలుగులో మరో మూడు సినిమాల వరకు చేస్తోంది.
Pooja hegde, kanna, radhe shyam, Beast