

బుట్టబొమ్మ పూజా హెగ్దే ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయింది. ఒకదాని తరువాత ఒకటిగా స్టార్ హీరోల సరసన ఛాన్స్‌లు కొట్టేసిందీ భామ. అమ్మడు ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన ‘రాధేశ్యామ్’ సినిమాలో నటించింది. దాంతో పాటుగా తమిళ స్టార్ హీరో విజయ్ తాజా సినిమా ‘బీస్ట్’లో కనిపించనుంది.
అయితే తాజాగా పూజా తన ట్విటర్‌లో షేర్ చేసిన ఓ వీడాయో తెగ వైరల్ అవుతోంది. ఇదే తన చివరి రోజు అంటూ అమ్మడు ఆ వీడియోలో పలు విషయాలను తెలిపింది. సినిమా చేస్తున్నప్పుడు చాలా ఎంజాయ్ చేశానని చెప్పింది. ‘బీస్ట్’ చిత్రీకరణ పూర్తి చేసుకున్న సందర్భంగా బుట్టబొమ్మ ఈ వీడియో షేర్ చేసింది.
‘సినిమా చిత్రీకరణ సమయంలో చాలా ఎంజాయ్ చేశా. విజయ్ తనదైన స్టైల్‌తో ప్రతి ఒక్కరినీ మెప్పించడం పక్కా. ఈ సినిమా షూటింగ్ చేసినంత కాలం ఏదో వెకేషన్‌కి వెళ్లినట్లే అనిపించింది. కానీ ఈ సినిమాలో నా పార్ట్ షూటింగ్ పూర్తయిపోయింది. ఇక ఈ సినిమా షూటింగ్‌లో భాగం కాలేకపోతున్నందుకు చాలా బాధగా ఉంది. కానీ మనమంతా థియేటర్లో కలుసుకొని కబుర్లు చెప్పుకుందాం’ అంటూ పూజా తన ట్వీటర్ వీడియోలో చెప్పుకొచ్చింది.
ఇది కూడా చదవండి: Mahesh Babu | సక్సెస్ సీక్రెట్ చెప్పేసిన సూపర్ స్టార్ మహేష్..
ఇదిలా ఉంటే ‘బీస్ట్’ సినిమాను విజయ్ హీరోగా నెల్సన్ దిలీప్ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాపై అటు తమిళ ప్రేక్షకులతో పాటు తెలుగులోనూ మంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే సినిమా నుంచి వచ్చిన ప్రతి అప్‌డేట్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ సినిమా విజయ్ నెవ్వర్ బిఫోర్‌లా కనిపిస్తాడని, అభిమానుల ఊహలను మించి అలరిస్తాడని మూవీ టీమ్ ధీమా వ్యక్తం చేస్తోంది. మరి అభిమానుల అంచనాలను విజయ్ అధిగమిస్తాడో లేదో తెలియాలంటే సినిమా విడుదల వరకు ఆగాల్సిందే.
1 thought on “Pooja Hegde | ఇదే నా లాస్ట్ అంటున్న పూజా హెగ్దే.. వీడియో వైరల్..”