

INDvsSA | టీమిండియా, సౌత్ ఆఫ్రికా మధ్య జరగబోతున్న రెండో టెస్టు జరగబోయే పిచ్ భారత్ కి బాగా కలిసొచ్చే పిచ్. ఇప్పటి వరకు ఈ పిచ్ పై భారత్ కి ఓటమి లేదు.
ఈ క్రమంలోనే సోమవారం నుంచి ఇక్కడ జరగబోయే రెండో టెస్ట్ మ్యాచ్ లో గెలిచి సిరీస్ కవసం చేసుకోవాలని, చరిత్ర సృష్టించాలని టీమిండియా భావిస్తోంది.
ఈ మర్మంలోనే పిచ్, వాతావరణం వంటి అంశాలను కూలంకషంగా పరిశీలిస్తోంది.
ముఖ్యంగా వాతావరణం, ప్రత్యర్థి టీమ్ పరిస్థితులను అంచనా వేసి, దానికి అనుకూలంగా తుది జట్టును ఎంపికచేయాలని టీమిండియా మేనేజ్‌మెంట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
కోహ్లీకి మార్పులు నచ్చవు:
సాధారణంగా గెలిచిన జట్టులో మార్పులు చెయ్యడానికి కోహ్లీ(Virat Kohli) ప్రయత్నించడు.
కానీ సిరీస్ గెలిస్తే సరికొత్త చరిత్ర సృష్టించే అవకాశం ఉండడంతో చిన్న తప్పు కూడా చేయకూడదని, పటిష్ట జట్టుతోనే బరిలోకి దిగాలని టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్(Rahul Dravid) పట్టుదలగా ఉన్నాడట.
ఈ క్రమంలోనే ఆటగాళ్ల ఎంపికపై ద్రవిడ్ దృష్టి సారించాడట.
ఓపెనర్లుగా కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ ఫస్ట్ టెస్ట్‌లో హిట్ కావడంతో వీళ్ళను తొలగించే అవకాశం లేదనే చెప్పాలి.
కానీ గత కొన్ని సిరీస్ ల నుంచి ఫామ్ లేక ఇబ్బంది పడుతున్న చతేశ్వర్ పుజారాకు ఇంకో అవకాశం ఇవ్వాలా..? వద్దా..? అని ద్రవిడ్ అనుమానిస్తున్నాడట.
ఫస్ట్ టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో గోల్డెన్ డక్‌గా వెనుదిరిగిన పుజారా.. రెండో ఇన్నింగ్స్‌లో కూడా 16 పరుగులు చేసి నిరాశపరిచాడు.
దీంతో అతనికి ఇంకా అవకాశాలివ్వాలా? అనే చర్చ జరుగుతోంది.
విహారి లేదా అయ్యర్..!
ఫామ్‌లో ఉన్న శ్రేయస్ అయ్యర్, హనుమ విహారిలకు చోటిస్తే బాగుంటుందని మేనేజ్‌మెంట్ అభిప్రాయపడుతోందట.
పుజారాను పక్కన పెడితే మొదటి ప్రాధాన్యం అయ్యర్‌కు ఉంటుంది.
ఇక వాండరర్స్ పిచ్ స్పిన్నర్లకు అంతగా సహకరించదు. దీంతో అశ్విన్‌ను తప్పించి విహారికి ఛాన్స్ ఇచ్చినా ఆశ్చర్యం లేదు.
అయితే ఈ నిర్ణయం నలుగురు ఫ్రంట్ లైన్ పేసర్ల ఫిట్‌నెస్ పై ఆధారపడి ఉంటుంది.
పేసర్లు ఫిట్ గా ఉంటే స్పిన్నర్ అవసరం ఉండదు. అప్పుడు విహారిని బ్యాటర్ గా తీసుకోవచ్చు.
కానీ మడమ గాయంతో బుమ్రా రెండో టెస్టుకు దూరమయ్యే ఛాన్స్ ఉంది. దీంతో అశ్విన్ స్థానానికి ఢోకా లేదనిపిస్తోంది.
పిచ్ రిపోర్ట్:
వాండరర్స్ పిచ్ స్వింగ్, సీమ్ బౌలర్లకు చాలా అనుకూలమని సంకేతాలు వస్తున్నాయి. దీంతో, శార్దూల్ ప్లేస్‌లో ఉమేశ్ యాదవ్ తుది జట్టులోకి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
శార్దూల్‌తో పోలిస్తే ఉమేశ్ బౌలింగ్‌లో ఫుల్ లెంగ్త్‌తో పాటు పేస్ ఎక్కువగా ఉంటుంది. అయితే కోహ్లీ ఆల్‌రౌండర్లను పక్కన పెట్టడానికి ఇష్టపడడు.
మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.
టీమిండియా తుది జట్టు(అంచనా) :
కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, చతేశ్వర్ పుజారా/శ్రేయస్ అయ్యర్, విరాట్ కోహ్లీ(కెప్టెన్), అజింక్యా రహానే, రిషభ్ పంత్, రవిచంద్రన్ అశ్విన్/హనుమ విహారి, ఉమేశ్ యాదవ్/శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ షమీ, జస్‌ప్రీత్ బుమ్రా/ఉమేశ్ యాదవ్, మహమ్మద్ సిరాజ్.
#TeamIndia #ViratKohli #INDvsSA #2ndTest