

Pakistan | పాకిస్తాన్ క్రికెటర్లకు వివాదాలు కొత్తేం కాదు. ఎవరో ఒక క్రికెటర్ ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో ఉంటుంటారు. కొంతమంది స్పాట్ ఫిక్సింగ్ వివాదాల్లో ఆటకే దూరమవుతుంటే ఇంకొంతమంది వ్యక్తిగత వివాదాల్లో చిక్కుకుని ఇబ్బందులు పడుతుంటారు. అయితే పాకిస్తాన్ క్రికెటర్, స్పిన్నర్ యాసిర్ షా వీటన్నింటినీ మించిన దారుణమైన అభియోగంలో జైలు పాలయ్యాడు. ఓ 14ఏళ్ల బాలికపై జరిగిన అత్యాచారం కేసులో నిందితుడికి సాయం చేయడంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.
ఓ మైనర్ బాలిక ఫిర్యాదుతో ఈ ఉదంతం వెలుగులోకొచ్చింది. యాసిర్ స్నేహితుడు ఫర్హాన్ తనపై అత్యాచారం చేశాడని ఆమె పోలీసులకు తెలిపింది. తనను తుపాకీతో బెదిరించి అత్యాచారం చేస్తూ ఆ దృశ్యాలను కెమెరాలో రికార్డ్ చేశాడని ఆరోపించింది. అంతేకాకుండా ఈ విషయం ముందుగా యాసిర్ షాకు చెబితే అతడు తనను ఎగతాళి చేశాడని ఆవేదన వ్యక్తం చేసింది.
అయితే తాను పోలీసులను ఆశ్రయించానని తెలిసి ఓ ఫ్లాట్ కూడా ఇస్తానని, కేసు వెనక్కి తీసుకోవాలని యాసిర్ తనను కోరాడని ఆమె తెలిసింది. దీంతో యాసిర్‌పై షాలిమార్ పోలీస్ స్టేషన్ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే అతడిని అరెస్ట్ చేశారా..? లేదా అనే విషయంపై క్లారిటీ లేదు.
#Pakistan #Cricket #YasirShah #Rape #MinorGirl #Police #Shalimar