

Radhe Shyam | పాన్ఇండియా స్టార్ ప్రభాస్ వరుస పాన్ ఇండియా సినిమాలతో అభిమానులకు కన్నుల పండుగ చేసేందుకు సిద్దమవుతున్నాడు. ఈ క్రమంలో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రాధేశ్యామ్ సినిమా విడుదలకు సిద్ధమైంది.
ఈ క్రమంలోనే మేకర్స్ సినిమా డిసెంబర్ 23న ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా ప్లాన్ చేశారు. అంతేకాకుండా ఈ ఈవెంట్‌కు అభిమానులే స్పెషల్ గెస్టులుగా రానున్నారు. వారే ట్రైలర్‌ను కూడా లాంచ్ చేయనున్నారు.
అయితే తాజాగా ఈ ఈవెంట్‌కు సబంధించి మరో అప్‌డేట్ వచ్చింది. ఈ ఈవెంట్‌ను ఓ యంగ్ హీరో హోస్ట్ చేయన్నాడట. అతనెవరో కాదు. మన జాతిరత్నం నవీన్ పోలిశెట్టి.
ఈ మేరకు వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. అయితే ఈ ఈవెంట్ హోస్ట్‌గా నవీన్‌ను సెలక్ట్ చేయడానికి మరో కారణం ఉంది.
నవీన్ అటు నార్త్‌తో పాటు ఇటు సౌత్‌లోనూ మంచి గుర్తింపు అందుకున్నారని టాక్ నడుస్తోంది. మరి కొందరు మాత్రం నవీన్ అన్ని వర్గాల అభిమానులకు హ్యాండిల్ చేయగలడని అందుకే సెలెక్ట్ చేశారని భావిస్తున్నారు.
ఏది ఏమైనా రాధేశ్యామ్ ఈవెంట్‌లో నవీన్ స్పెషల్ ఎట్రాక్షన్ కానున్నాడని అంటున్నారు. మరి నవీన్ అంతలా ఆకట్టుకుంటాడో లేదో చూడాలి.
#Prabhas #NaveenPolisetty #Radheshyam #RadheShyamPreReleaseEvent